సమ్మర్ స్పెషల్.. అటుకులతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్..

సాధారణంగా పాయసం అంటేనే నోరూరుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా పాయసాన్ని లాగించేస్తుంటారు. దేవుడికి నైవేద్యంగా పాయసం చేస్తుంటారు. ఈ పాయసాన్ని బెల్లంతో గానీ చక్కెరతోగానీ చేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అటుకులతో పాయసం ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? అటుకులతో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది.

అయితే అటుకులతో పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. అటుకులు తగినన్ని, పాలు, తురిమిన బెల్లం తగినంత, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొన్ని బాదం పలుకులు, జీడిపప్పులు , కిస్ మిస్ లు తగినన్ని తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అటుకులను వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత వీటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకుని సన్నగా తరుక్కుని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓ గిన్నె పెట్టి అందులో తగినన్ని పాలు పోయాలి. ఆ తర్వాత అందులోనే బెల్లం తురుము, యాలకుల పొడి వేసి గరిటెతో బాగా మిక్సింగ్ అయ్యేంత వరకూ కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఓ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు మరిగిన అనంతరం అందులో వేయించుకున్న అటుకులను వేయాలి.

Summer Special Poha Payasam Recipe Make It This Way for Super Delicious Taste summer special

మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కొద్దిసేపు అలాగే ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలా అయ్యే వరకు వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఆ తర్వాత అటుకులు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిలో రెండు స్పూన్ ల నెయ్యి, బాదం పలుకులు, 6 కిస్‌ మిస్‌ లను కూడా వేస్తే సరి.. సూపర్ టేస్టీ అటుకుల పాయసం రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+