సమ్మర్ స్పెషల్ 'సుగంధ షర్బత్'.. క్షణాల్లో గ్లాసు లేపేస్తారు..!

వేసవిలో ఎక్కువగా చల్లని పదార్థాలను తీసుకోవాలని అనిపిస్తుంది. మసాలా, ఫ్రై వంటి ఫుడ్స్ కాకుండా తేలికగా జీర్ణం అయ్యే విధంగా ఆహారాన్ని తీసుకుంటారు. అయితే సమ్మర్ స్పెషల్ షర్బత్ ఎప్పుడైనా తాగారా..? రోడ్డు పక్కన దొరికే ఈ సుగంధ షర్బత్ ను తక్కువ పదార్థాలతో ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ సుగంధ షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సి పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

సుగంధ షర్బత్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా చల్లని నీరు ఒక గ్లాస్, చక్కెర సిరప్ మూడు టేబుల్ స్పూన్ లు, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, రోజ్ ఎసెన్స్ లేదా గులాబ్ జలం రెండు లేదా మూడు డ్రాప్స్, యాలకుల పొడి చిటికెడు, పూదీనా ఆకులు కొద్దిగా, ఐస్ క్యూబ్స్ ఐదు లేదా ఆరు తీసుకోవాలి. ఇలా తక్కువ ఐటెమ్స్ తోనే టేస్టీ సుగంధ షర్బత్ తయారు చేసుకోవచ్చు.

Summer Special Sugandha Sherbet Recipe Easy Delicious Way to Prepare at Home with Few Ingredients

ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా ఓ గ్లాస్ లో చల్లటి నీరు, చక్కెర సిరప్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో రోజ్ ఎసెన్స్, యాలకుల పొడి వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పూదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపాలి. అంతే చల్లగా సుగంధ షర్బత్ ను సర్వ్ చేసుకోవడమే.. సూపర్ టేస్టీ సుగంధ షర్బత్ రెడీ అయినట్టే.. ఇలా మీరూ ఓసారి ట్రై చేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+