భారీగా పెరిగిన బంగారం ధరలు..! మంట పుట్టిస్తున్న పసిడి

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించకపోవడంతో, ఆ ప్రభావం నేరుగా బులియన్ మార్కెట్‌పై పడుతోంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతుండటంతో, పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఏప్రిల్ 16, గురువారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా ఎగబాకాయి.

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. చమురు దిగుమతులు నిలిచిపోతాయన్న ఆందోళనతో ఆసియా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటే, బులియన్ మార్కెట్ మాత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నిన్నటి భారీ పెరుగుదలను కొనసాగిస్తూ, నేడు కూడా పసిడి తన దూకుడును ప్రదర్శించింది.

Gold Rate Today April 16 Prices Surge as Iran-US Conflict Rattles Markets 24K Gold Hits Record Rs 155570

దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.22 పెరిగి రూ.15,557 వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.20 పెరిగి రూ.14,260 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 100 గ్రాముల 24 క్యారెట్ల పసిడి కొనాలంటే ఇప్పుడు ఏకంగా రూ.15,55,700 వెచ్చించాల్సిందే. సామాన్యులు ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల 100 గ్రాముల ధర కూడా రూ.14.26 లక్షల మార్కును దాటేసింది.

Gold: అక్షయ తృతీయ షాక్. తులం ఎంతంటే!
Gold: అక్షయ తృతీయ షాక్. తులం ఎంతంటే!

నగరాల వారీగా పసిడి రేట్లు ఇలా:

తెలుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధాని వరకు ప్రతిచోటా ధరలు మండుతున్నాయి.

  • ముంబై, బెంగళూరు, కోల్‌కతా: ఈ ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,570 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,600గా ఉంది.
  • విశాఖపట్నం: స్టీల్ సిటీలో కూడా ధరల జోరు తగ్గలేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.1,55,570 కి చేరింది.
  • చెన్నై: దేశంలోనే అత్యధిక ధర చెన్నైలో నమోదైంది. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,56,230 పలుకుతోంది.
  • ఢిల్లీ & అహ్మదాబాద్: ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,55,720 గా ఉండగా, అహ్మదాబాద్‌లో రూ.1,55,620 వద్ద కొనసాగుతోంది.

దేశంలో నేటి వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గ్రాము రూ.275గా ఉంది. కిలో రూ. 2,75,000.

 మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్
మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్

యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో బంగారం ధరలు రూ.2 లక్షల మార్కును తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+