9020mAh బ్యాటరీ, 50MP Sony కెమెరాతో Vivo T5 Pro 5G.. ఎంతంటే ??
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo ప్రపంచవ్యాప్తంగా ఫ్లాగ్‌షిప్ & మిడ్-రేంజ్ ఫోన్లతో మంచి మార్కెట్ సాధించింది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్, ఆపిల్ వంటి దిగ్గజాలకు వివో గట్టి పోటీ ఇస్తుంది. కాగా ప్రస్తుతం భారత మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ భారీగా పెరుగుతోంది. తమ ఇన్నోవేటివ్ డిజైన్‌లు, కెమెరా టెక్నాలజీ, పనితీరుతో యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. ముఖ్యంగా మధ్యస్థ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడం ద్వారా భారత మార్కెట్‌లో వివో మంచి క్రేజ్‌ను సంపాదించింది.
కొత్త లాంచ్ - Vivo T5 Pro 5G
ఈ నేపథ్యంలో, వివో తన కొత్త T సిరీస్‌లో భాగంగా Vivo T5 Pro 5Gను భారతదేశంలో ఏప్రిల్ 15, 2026న విడుదల చేసింది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, ప్రీమియం డిస్‌ప్లేతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వగల ఫోన్‌గా నిలుస్తోంది. బ్యాటరీ లైఫ్, గేమింగ్, మల్టీమీడియా వినియోగం కోరుకునే యూజర్లకు ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రారంభ ఆఫర్లలో భాగంగా Axis, HDFC, SBI బ్యాంక్ కార్డులపై ₹3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Vivo T5 Pro 5G ఫీచర్స్..
డిస్‌ప్లే..
Vivo T5 Pro 5Gలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఇది అత్యంత ప్రకాశవంతమైన మరియు స్మూత్ విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. 2160Hz PWM డిమ్మింగ్ వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
పనితీరు & ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm టెక్నాలజీ ఆధారిత Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌ను అందించారు. ఇది సుమారు 1.2 మిలియన్ల AnTuTu స్కోర్ సాధిస్తుందని కంపెనీ తెలిపింది. 7K VC కూలింగ్ సిస్టమ్, 120FPS గేమింగ్ సపోర్ట్‌తో హెవీ గేమింగ్ కూడా ల్యాగ్ లేకుండా సాగుతుంది.
కెమెరా..
ఫోటోగ్రఫీ కోసం 50MP Sony IMX882 ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 2MP డెప్త్ సెన్సర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్, నైట్ మోడ్, AI ఫోటోగ్రఫీ ఫీచర్లు ఈ ఫోన్‌ను కెమెరా పరంగా బలంగా నిలబెడతాయి.
సాఫ్ట్‌వేర్ & అప్‌డేట్స్..
ఈ ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. వివో 3 సంవత్సరాల OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని ప్రకటించింది. అదనంగా AI ఫీచర్లు, స్మార్ట్ జెస్టర్స్, గేమ్ మోడ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
డిజైన్ & డ్యూరబిలిటీ..
Vivo T5 Pro 5G సన్నని 8.25mm డిజైన్‌తో స్టైలిష్‌గా ఉంటుంది. IP68, IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో ఇది కఠిన పరిస్థితుల్లో కూడా సురక్షితంగా పనిచేస్తుంది.
బ్యాటరీ & ఛార్జింగ్..
ఈ ఫోన్ ప్రధాన హైలైట్ 9020mAh భారీ బ్యాటరీ. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 37 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. దీర్ఘకాల వినియోగం కోసం 5 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ గ్యారంటీ కూడా ఉంది.
కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు..
5G సపోర్ట్‌తో పాటు Wi-Fi 6, Bluetooth 5.4, USB Type-C పోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా హై-రిజల్యూషన్ ఆడియో, గేమింగ్ ట్రిగర్స్ వంటి ఫీచర్లు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.
ధర & అందుబాటు..
Vivo T5 Pro 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది:
8GB + 128GB - ₹29,999
8GB + 256GB - ₹33,999
12GB + 256GB - ₹39,999
ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications