ఆ ఒక్క నిర్ణయంతో తమిళనాడు ఎన్నికల సీన్ రివర్స్ - విజయ్ కు ఊహించని వరం..!!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడు తున్న వేళ కేంద్రం మహిళా బిల్లు.. డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్ ప్రవేశ పెడుతోంది. ఇదే సమయంలో తమిళనాడు లో డీలిమిటేషన్ బిల్లు విపక్షాలకు సెంటిమెంట్ అస్త్రంగా మారుతోంది. సీఎం స్టాలిన్ స్వయంగా నల్ల చొక్కలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆత్మ రక్షణ లో పడింది. ఈ పరిణామాలు టీవీకే చీఫ్ విజయ్ కు వరంగా మారుతున్నాయి.
కేంద్రం ఈ రోజు నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెడుతోంది. కాంగ్రెస్ సహా మిత్ర పక్షాలు మహిళా బిల్లుకు మద్దతు ఇస్తూనే.. డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల కు డీలిమిటేషన్ తో నష్టం జరుగుతుందని విపక్షాలు వాదిస్తున్నాయి. ఎన్నికల వేళ డీలిమిటేషన్ ను తమిళనాడులో డీఎంకే అస్త్రంగా మలచుకుంది. కేంద్రం పైన పోరాటానికి సీఎం స్టాలిన్ సిద్దం అయ్యారు. డీలిమిటేషన్ బిల్లును స్వయంగా స్టాలిన్ దహనం చేసారు. నల్ల దుస్తులు ధరించి.. కేంద్రం పైన నిరసనల్లో పాల్గొన్నారు. నల్ల జెండా ఎగురవేసారు. దక్షిణాదికి అన్యాయం చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. గతంలో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన ప్రతిఘటన ఢిల్లీని దహించివేసిందని, ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టడం ద్వారా మరో జ్వాలను రగిలించానని స్టాలిన్ పేర్కొన్నారు.

తమిళనాడులో ఎన్నికల వేళ మారుతున్న లెక్కలు
ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని స్టాలిన్ పేర్కొన్నారు. డీలిమిటేషన్ విషయం లో డీఎంకే తరహాలోనే టీవీకే విజయ్ సైతం స్పందిస్తున్నారు. దక్షిణాదికి అన్యాయం చేసే విధం గా డీలిమిటేషన్ చేయటం సరికాదని చెప్పుకొచ్చారు. ఈ రోజు పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. కాగా, డీఎంకే కు పోటీ ఇస్తున్న వేళ ఈ డీలిమిటేషన్ వ్యవహారం అన్నాడీఎంకే కు సమస్యగా మారు తోంది. డీలిమిటేషన్ ను డీఎంకే సెంటిమెంట్ వ్యవహారంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో.. ఎన్డీఏ కూటమి ఆత్మరక్షణలో పడుతోంది. ఇదే సమయంలో సర్వేల్లో వెనుకంజలో ఉన్న టీవీకే పార్టీకి ఈ వ్యవహారం కొత్త వరంగా మారుతోంది. దీంతో.. స్టాలిన్ తో సమానంగా నిరసనలకు విజయ్ సిద్దం అవుతున్నారు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పైన ఈ సెంటిమెంట్ అస్త్రం వర్కవుట్ అయితే తనకు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో.. మిగిలిన అయిదు రోజుల సమయం లో కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని విజయ్ డిసైడ్ అయ్యారు. ఈ డిలిమిటేషన్ వ్యవహారం తమిళనాడు ఎన్నికల ఫలితాల పైన ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications