ప్రభాత సూర్య కిరణాలతో సన్ బాత్... మలైకా ఆరోరాలా మెరిసిపొండి!

మన ఆరోగ్యాన్ని కాపాడే శక్తి, మనల్ని అందంగా ఉంచే శక్తి సూర్య భగవానుడికి ఉంది అంటే నమ్మి తీరాల్సిందే. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఎంత వయసు వచ్చినా ఇంకా అందంగా కనిపిస్తున్నారంటే వారు ప్రతిరోజూ చేసే కొన్ని చర్యలే కారణం. ప్రభాత సూర్యునికి సూర్య నమస్కారాలు చేయడమే కాదు ఇంకా ఎన్నో విధాలుగా సూర్యుని ద్వారా లబ్ధి పొందుతున్నారు.

సూర్యకాంతి తమ శరీరం పై పడేలాగా సన్ బాత్
అందుకే మలైకా అరోరా లాంటి చాలామంది 50 ఏళ్ల వయసు దాటినా సరే తమ అందంతోను, ఫిట్నెస్ తోను ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు. ప్రభాత సూర్యుని ఎదుట నేలపై పడుకొని ఆ సూర్యకిరణాల కాంతిని శరీరమంతా ఆవాహనం చేసుకొని చేసే సన్ బాత్ బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు చేస్తూ ఉంటారు. సన్ బాత్ అంటే సూర్యకాంతితో స్నానం చేయడం అంటే సూర్యకాంతి తమ శరీరం పై పడేలాగా ఉండడం.

Sunbath with the rays of the morning sun look radiant like malaika arora

సన్ బాత్ తో బోలెడు లాభాలు
ఎవరైతే ప్రతిరోజూ తెల్లవారుజామున వచ్చే సూర్యకిరణాలకు తమ శరీరాన్ని ప్రదర్శిస్తారో వారికి విటమిన్ డి డెఫిషియన్సీ అసలే ఉండదు. ఫలితంగా విటమిన్ డీ లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి అవసరమైన సూర్యకాంతి మన శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడం మాత్రమే కాకుండా , సౌందర్యాన్ని సంతరింప చేసుకునేలాగా కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది.

చర్మం నిగారింపును పెంచే సన్ బాత్
ఇంకా ముఖ్యంగా చలికాలంలో సూర్యకాంతిలో శరీరాన్ని ఉంచి సన్ బాత్ చేయడం ద్వారా మన చర్మం పై ఏర్పడిన ముడతలు మచ్చలు తగ్గిపోతాయి. మితంగా సూర్యరశ్మి మన శరీరానికి తాకేలాగా సూర్యరశ్మి కాంతికి పడుకొని దానిని ఆస్వాదించడాన్ని సన్ బాత్ అంటారు . దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. మన నిద్ర నాణ్యత, ఆకలి, ఎనర్జీ లెవెల్స్ ను మెరుగుపరుస్తుంది.

రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆరోగ్యం
మన శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఇక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సన్ బాత్ ను రెగ్యులర్ గా చేయడం మీ జీవితంలో మిరాకిల్స్ చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకొని పైసా ఖర్చు కూడా కానీ ఈ టెక్నిక్ ను అసలు మర్చిపోకండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+