సేమియా సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ!

పాయసం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందులోనూ సేమియా, సగ్గుబియ్యం పాయసం సరైన విధానంలో చేస్తే ప్రత్యేకమైన రుచితో చాలా బాగుంటుంది. సేమియా సగ్గుబియ్యం పాయసం చక్కెరతో కాకుండా బెల్లంతోను, పాలు వాడకుండా కొబ్బరి పాలతో కూడా తయారు చేసుకోవచ్చు.

సేమియా సగ్గుబియ్యం పాయసం

చక్కెర బెల్లం రెండు కలిపి, పాలు కొబ్బరి పాలు రెండు కలిపి కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసినా సరైన కొలతలతో చేసినప్పుడు ఇది చాలా రుచికరంగా ఉంటుంది. పండుగల సమయంలో ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం తయారుచేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పెడితే బాగుంటుంది. మరి సేమియా సగ్గుబియ్యం పాయసం ఏవిధంగా తయారు చేయాలి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

super tasty semiya saggubiyyam payasam make in this process for yummy sabudana vermicelli kheer

కావాల్సిన పదార్థాలు

సేమియా - 1 కప్
సగ్గుబియ్యం - 1/4 కప్
పలుచని కొబ్బరి పాలు - 1.5 కప్, లేదా చిక్కటి పాలు - రెండు కప్పులు
బెల్లం - 1 కప్ (అవసరమైతే కొంచెం ఎక్కువ)
నెయ్యి - 3 టీ స్పూన్లు
యాలకుల పొడి - 1 టీ స్పూన్
పచ్చి కొబ్బరి ముక్కలు - 1/4 కప్
జీడిపప్పు - 10-15
కిస్మిస్ - 10

తయారు చేసే విధానం

ముందుగా బెల్లాన్ని మెత్తని పొడిగా చేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కరిగించి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పాన్లో నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ ని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొబ్బరి ముక్కలను కూడా నెయ్యి వేసి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

సగ్గుబియ్యం, సేమియా ఇలా వండుకోవాలి

అదే పాన్లో మరి కొంత నెయ్యి వేసి అందులో సేమియా సగ్గుబియ్యం రెండింటినీ కలిపి సన్నని సెగ మీద వేయించుకోవాలి. సేమియా రంగు మారేవరకు వేయించుకోవాలి. ఇలా వేగిన సేమియా సగ్గుబియ్యం మిశ్రమానికి మూడు కప్పుల వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. సుమారు పది 15 నుండి 20 నిమిషాలలో సగ్గుబియ్యం మెత్తబడుతుంది.

పాలు, కొబ్బరి పాలు ఏది వాడినా టేస్ట్ సూపర్

ఆ తర్వాత అందులో కొబ్బరిపాలు కానీ , కాగపెట్టుకున్న చిక్కటి పాలు గానీ పోసుకోవాలి. అది ఉడుకుతుండగా అందులో కరిగించిన బెల్లం నీళ్లు పోయాలి.మళ్లీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చివరిగా యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసం వేడిగా లేదా చల్లగా తీసుకుంటే బాగుంటుంది. పండుగల్లో లేదా అతిథులు వచ్చినప్పుడు స్పెషల్‌గా చేసి తీపి పండుగ చేసుకోండి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+