ఎముకలు, కండరాల బలానికి ఈ ఫుడ్ తీసుకోండి
జీవనశైలి పూర్తిగా మారిపోవడంతో అనారోగ్య సమస్యలు తామరతుంపరలుగా వెంటాడుతున్నాయి. వీటిల్లో కండరాల నొప్పులతోపాటు ఎముకలు బలహీనపడటం ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లో ఎముకలు, కండరాల బలోపేతానికి వైద్యులు కొన్ని సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందాం.
ప్రొటీన్ ఫుడ్ : ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. గుడ్డు, మాంసం, బఠానీలు బాదం, సోయా బీన్ చిక్‌పీస్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఉల్లిపాయలు తిననివారిలో బోలు ఎముకల వ్యాధి రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల ఇంగ్లండ్ లో జరిగిన ఒక పరిశోధనలో తేలింది.

కాల్షియం, విటమిన్స్ కోసం : విటమిన్ డి, విటమిన్ కె, కాల్షియం, విటమిన్ సి అవసరమవుతాయి. ఎముకల నిర్మాణంలో కాల్షియం పాత్ర కీలకం. ప్రతిరోజు మన శరీరానికి 100 మిల్లీగ్రాముల కాల్షియం అవసరపడుతుంది. విటమిన్ డి అందకపోతే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. ఎముకల్లో పునర్నిర్మాణ ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుంటుంది. గుండె కండరాలతోసహా చాలా కండరాలకు కాల్షియం అవసరం. సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది.
ప్రతిరోజు వ్యాయామం : కొన్ని ప్రత్యేక వ్యాయామాలు ప్రతిరోజు చేస్తుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. డయాబెటిస్ ఉన్న చిన్నపిల్లల్లో కూడా ఈ వ్యాయామాల ద్వారా ఎముక నిర్మాణం ఉంటుంది. సప్లిమెంట్స్ తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయడంద్వారా బోలు ఎముకల వ్యాధి, ఆస్టియో పెనియా రిస్క్ తగ్గుతుంది.
ప్రొటీన్ రిచ్ బ్యాలెన్స్ డ్ ఫుడ్ : రోజువారీ అవసరాలకు శరీరానికి 1500 కేలరీలు అవసరమవుతాయి. ఎముక, కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రోటీన్ రిచ్ బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకుంటుండాలి. మద్యం, ధూమపానం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని మానుకోవాలి. మద్యం ఎక్కువగా తీసుకుంటే ఆస్టియో పోరోసిస్ రిస్క్ పెరుగుతుంది. వెన్నుముక సమస్యలతో ధూమపానానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. హై షుగరు డ్రింక్స్ తీసుకోకూడదు. అలాగే రోజూ రెండు లీటర్ల నీటిని కచ్చితంగా తాగుతూ ఉండాలి. తద్వారా శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూడాలి.












Click it and Unblock the Notifications