తెలంగాణ స్టైల్ కొరమీను చేపల పులుసు.. ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్..!
చేపలకూర పేరు చెబితేనే చాలామందికి నోరూరూతుంది. ఇక సరిగా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. చేపలకూరకు అంత డిమాండ్ ఉంది. అయితే రకరకాల చేపలను మీరు ట్రై చేశారు. కానీ కొరమీను చేపల పులుసు రుచి అన్నింటికీ రాదు. కొరమీను చేపల పులుసుకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మరి టేస్టీ కొరమీను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలి..? అది కూడా తెలంగాణ స్టైల్ లో చేస్తే ముక్క కూడా మిగుల్చకుండా తినేస్తారు.. మరి ఈ తెలంగాణ స్టైల్ కొరమీను చేపల పులుసు ఎలా చేసుకోవాలి..?
కొరమీను చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. కొరమీను ముక్కలు ఒక కేజీ, పచ్చిమిర్చి 3, నూనె తగినంత, ఉల్లిపాయలు 3 , ఆవాలు, ఎండుమిర్చి 3, మెంతి పిండి అర స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర స్పూన్, చింతపండు నిమ్మకాయ సైజు, కారం సరిపడా, ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి.
ఇక తయారీ విధానం చూస్తే.. సరిపడా చింతపండును నాన బెట్టుకోవాలి. అలాగే చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నెపెట్టుకోవాలి. అందులో తగినంత నూనె పోసి.. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అనంతరం ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులో ఎండుకొబ్బరి పొడి, మెంతి పొడి వేసి రోస్టు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు ఉడికించుకోవాలి.

తర్వాత ఆ మిశ్రమంలో చింతపండు గుజ్జు పోసి ఓసారి కలిపి అందులోనే కారం, ధనియాల పొడి వేసి మగ్గించుకోవాలి. అలా నూనె పైకి తేలిన తర్వాత పులుపుకు సరిపడా నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. అలా అలా మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడ్డాక చేప ముక్కలు అందులో వేయాలి. కొన్ని నీళ్లు, పచ్చిమిర్చి ముక్కలు వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఆ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చివరగా చేపల పులుసుపై కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ అయినట్లే..
-
ఇంట్లోనే హైదరాబాదీ స్టైల్ "చికెన్ హలీమ్" ఈజీగా ఎలా చేయాలంటే..? -
"పొట్లకాయ పప్పు" ఇలా చేస్తే ఆ టెస్టే వేరబ్బా.. -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్












Click it and Unblock the Notifications