టెంపుల్ స్టైల్ పులిహోర పులుసు ఇలా చేసి పెట్టుకుంటే నెలరోజులైనా బాగుంటుంది!
పులిహోర సహజంగా ప్రతిఒక్కరూ ఇష్టపడతారు. అయితే చింతపండుతో తయారుచేసే టెంపుల్ స్టైల్ పులిహోర అంటే ఇష్టంలేని వారెవరు ఉండరు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పులిహోర పులుసును ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. పులిహోర పులుసు తయారీ విధానంలోనే పులిహోర టేస్ట్ వస్తుంది. అసలు పులిహోర పులుసుని ఏ విధంగా తయారు చేయాలి. దానిలో ఏం వేస్తే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఎక్కువకాలం నిలువ ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం.
పులిహోర పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
చింతపండు- పావు కిలో
ఉప్పు - తగినంత
నూనె- రెండు స్పూన్లు
సొంటి మిరియాల పొడి- రెండు స్పూన్లు
జీలకర్ర మెంతుల పొడి- ఒక స్పూన్
పచ్చిమిరపకాయలు- 20
ఎండు మిరపకాయలు- 10
పసుపు- ఒక స్పూను

తయారీ విధానం
పులిహోరకు ఉపయోగించే పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండును నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. బాగా చిక్కగా చింతపండు గుజ్జు తీసుకొని పిప్పి లేకుండా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి . దానిని స్టవ్ ఆన్ చేసి స్టౌ పైన పెట్టి సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు పులుసు క్వాంటిటీని బట్టి ఉప్పు, సొంటి, మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి వేసి సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి.
ఇలా చేస్తే పులిహోర పులుసు బాగుంటుంది
అందులోనే కొద్దిగా నూనె, ఒక స్పూన్ పసుపు, 20పచ్చిమిరపకాయలు, 10ఎండుమిరపకాయలు పులుసులోనే వేసి ఉడికించుకోవాలి. పులుసు బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. సిమ్ లో పెట్టి నిదానంగా ఉడికించడం వల్ల పులిహోర పులుసు ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అయితే ఇలా చేసిన పులిహోర పులుసు నెలరోజుల వరకు మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
ఇలా చేస్తే రుచికరమైన పులిహోర
ఈ పులుసుతో పులిహోర తయారు చేసుకోవడానికి వేడివేడి అన్నంలో అన్నం క్వాంటిటీని బట్టి పులుసు కలిపి, పులిహోర క్వాంటిటీ ని బట్టి నూనె ఒక చిన్న పాన్ లో పోసుకొని స్టవ్ వెలిగించి, నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు, పల్లీలు, ఎండు మిరపకాయలు వేసి అందులో కరివేపాకు వేసి పోపు కాలిన తర్వాత దానిని పులిహోరలో కలుపుకుంటే రుచికరమైన పులిహోర తయారవుతుంది. కొందరు పులుసులోనే పోపు కూడా వేసుకుంటారు.
ఎప్పుడు కావాలన్నా ఇన్స్టాంట్ పులిహోర
ఇలా పులుసు తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది. మరి ఎందుకు ఆలస్యం ఈ పులిహోర పులుసును మీరు కూడా తయారుచేసుకుని స్టోర్ చేసుకోండి.
-
కొడవ స్టైల్ "పంది కర్రీ" ఎలా చేయాలంటే... "విజయ్ - రష్మిక" పెళ్లిలో కూడా ఇదే ! -
సమ్మర్ డ్రింక్.. పుచ్చకాయ జ్యూస్.. ఇదొక్కటి యాడ్ చేసుకుంటే.. -
రెస్టారెంట్ స్టైల్ 'పాలక్ పనీర్' కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
కోనసీమ స్పెషల్ "కోడిగుడ్డు - ఎండు రొయ్యలు కూర" ఎలా చేయాలంటే..? -
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా












Click it and Unblock the Notifications