కొత్తిమీర జ్యూస్ - డయాబెటీస్, కొలెస్ట్రాల్ సహా ఈ సమస్యలకు చెక్..!!
కొత్తమీర. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. శరీరానికి కావల్సిన అనేక పోషకాలు కొత్తిమీరలో ఉంటాయి. విటమిన్లు సి, ఎ, ఇలతోపాటు పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ కొత్తిమీరలో పుష్కలంగా లభ్యం అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొత్తిమీరను రోజూ ఉదయం పరగడుపునే జ్యూస్‌లా తీసుకోవటం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. కొత్తిమీర తీసుకోవటం ద్వారా ప్రయోజనాల గురించి పలు పరిశోధనలు కీలక అంశాలు వెల్లడించాయి.
కొత్తమీర జ్యూస్ ప్రతీ రోజు ఉదయం సమయంలో తీసుకోవటం ద్వారా ఇందులో ఉండే మైక్రోబియ ల్ గుణాలు పలు రకాల బ్యాక్టీరియా ఫంగస్ ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. దీంతో ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. కొత్తిమీర జ్యూస్‌ను తాగితే సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఇందు లో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. రోజూ ఉదయం పరగడుపునే సేవిస్తుంటే శరరీంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరు గుతుంది. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది.

అదే విధంగా.. కొత్తిమీర ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణ వ్యవస్థలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. షుగర్ ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. కొత్తిమీర జ్యూస్ రోజూ తాగితే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవడంతోపాటు శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. కొత్తిమీరలో విటమిన్లు ఎ, సి, ఇ, కెరోటి నాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. కొత్తిమీర జ్యూస్‌ను సేవించడం వల్ల చర్మం సైతం ఆరోగ్యంగా ఉంటుంది. కొత్తిమీర ఆకుల్లో ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు చర్మ ఇన్‌ఫెక్షన్లను తగ్గి స్తాయి. కొత్తిమీర ఆకుల్లో ఉండే క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో.. ప్రతీ రోజు ఒక కొత్తిమీర జ్యూస్ ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications