తరచూ శుభ్రం చేయకూడని శరీరభాగాలివే!
ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉండాలి. అయితే శుభ్రత పేరుతో పొద్దుకు పది సార్లు స్నానం చేసేవారు ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వైద్యనిపుణులు. మన శరీరంలో కొన్ని భాగాలను ఎక్కువగా శుభ్రం చేయకూడదని, వాటికి ఎక్కువగా శుభ్రం చేయడం వల్ల అనేక అనారోగ్యసమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని, ఆయా శరీరభాగాల సెన్సిటివిటీ పెరుగుతుందని చెబుతున్నారు. మరి ఎటువంటి శరీరభాగాలను ఎక్కువ శుభ్రం చేయకూడదనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ముఖాన్ని పదేపదే కడుగుతున్నారా?
చాలామంది ముఖం తెల్లగా ఉండాలని, నిగారింపును సొంతం చేసుకోవాలని పదేపదే ముఖాన్ని సబ్బుతో రుద్దుతూ కడుగుతూ ఉంటారు. ఇలా ముఖాన్ని పదేపదే శుభ్రం చేయడం మంచిది కాదు. రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది కానీ తరచూ ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల ధర్మంలో ఉన్న సహజ నూనెలు తొలగిపోయి ముఖం అందవిహీనంగా తయారవుతుంది. కనుక ముఖాన్ని పదేపదే ఎక్కువసార్లు రుద్ది శుభ్రం చేయకండి.

ఈ శరీర భాగాన్ని ఎక్కువ శుభ్రం చేస్తే జరిగేదిదే
ఇక ముక్కు లోపలి భాగాన్ని కూడా మనం ఎక్కువసార్లు శుభ్రం చేయకూడదు. ముక్కు లోపలి భాగంలో గాలిని శుభ్రపరిచే తేమను అందించే ఒక పొర ఉంటుంది. దీనిని ఊరికే ఎక్కువసేపు నీళ్లతో శుభ్రం చేస్తే ఈ పొర దెబ్బతిని, శుభ్ర పరిచే ఫిల్టర్ దెబ్బ తింటుంది. దీనివల్ల గాలిలో ఉన్న దుమ్ము చూడు ఈజీగా లోపలికి వెళుతుంది.
ఈ శరీర భాగం విషయంలో జాగ్రత్త
ఇక ఎక్కువగా శుభ్రం చేయకూడని శరీర భాగాలలో జననేంద్రియాలు కూడా ఒకటి. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఎక్కువసేపు సబ్బుతో రుద్దుతూ, నీళ్లతో తరచూ శుభ్రం చేస్తే దానికి ఉండే పీహెచ్ స్థాయిలు దెబ్బతింటాయి. సాధారణంగా ఒకటి రెండుసార్లు జననేంద్రియాలను శుభ్రం చేసుకోవచ్చు. కానీ పదే పదే సబ్బు రుద్దుతూ జననేంద్రియాలను శుభ్రం చేయడం మంచిది కాదు.
ఎక్కువ శుభ్రం చేయకూడని శరీర భాగాలివే
చాలామంది పాదాల మధ్య భాగంలోనూ, కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తరచూ శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా శుభ్రం చేయడం కూడా మంచిది కాదు. కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎక్కువసేపు నీటితో శుభ్రం చేస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది పాదాల మధ్య భాగం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. దానిని కూడా ఎక్కువసేపు రుద్దుతూ శుభ్రం చేయకూడదు. ఎక్కువసేపు రుద్దితే మురికి పోతుందని అనుకుంటే అది పొరపాటు. శరీరంలోని భాగాలను వాటి సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే శుభ్రం చేసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications