డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

ప్రస్తుత సమాజంలో డయాబెటిస్ మనల్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిలా తయారైంది. రోజు రోజుకి డయాబెటిస్ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. మధుమేహం ఒక సైలెంట్ కిల్లర్ లా మనిషి ప్రాణాలను హరిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా మధుమేహం లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే అసలు మధుమేహం వచ్చింది అని ఎలా తెలుస్తుంది. డయాబెటిస్ యొక్క ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటే డయాబెటిస్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించడానికి వీలుంటుంది.

డయాబెటిస్ బాధితులకు కనిపించే లక్షణాలు
ఇక డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను చూసినట్లయితే డయాబెటిస్ వచ్చిన వారికి విపరీతమైన దాహంగా ఉంటుంది. శరీరం నీటి కొరతను అధిగమించటానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే డయాబెటిస్ బాధితులు ఎక్కువ నీళ్లను తాగడానికి ఆసక్తి చూపిస్తారు. డయాబెటిస్ వచ్చిన వారికి తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. దీనివల్ల శరీరంలో కోల్పోయిన నీటిని తిరిగి పొందడం కోసం డయాబెటిస్ బాధితులు ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు.

These are the early symptoms of diabetes Beware

ఈ లక్షణాలుంటే జాగ్రత్త
రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు. ఇది డయాబెటిస్ బాధితులలో ప్రధాన లక్షణాలలో ఒకటి. ఇక రాత్రిపూట మూత్ర విసర్జన కారణంగా తరచుగా లేవవలసి వస్తుంది. దీనివల్ల నిద్ర భంగం కలుగుతుంది. ఇక్కడ డయాబెటిస్ బాధితులకు శరీరం బలహీనంగా అనిపిస్తుంది. అధికంగా అలసటగా ఉంటుంది. ఎక్కువగా మత్తుగా, నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది.

బరువు తగ్గుతున్నారా... అయితే అలెర్ట్
ఇక్కడ డయాబెటిస్ బాధితులు ఆహారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకపోయినా కూడా భారీగా బరువు తగ్గడం జరిగితే డయాబెటిస్ గా గుర్తించి చికిత్స తీసుకోవాలి. చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కళ్ళల్లోని ద్రవస్థాయిలో కూడా మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల అస్పష్టమైన దృష్టి సమస్య వస్తుంది. ఇలా కంటి సమస్యలు వస్తే కూడా డయాబెటిస్ ప్రారంభ లక్షణాలుగా గుర్తించాలి.

డయాబెటిస్ తో ఈ సమస్యలు
అంతేకాదు డయాబెటిస్ బాధితులకు విపరీతమైన ఆకలి అవుతుంది. చర్మం పొడిబారినట్టు ఉంటుంది. కాళ్లు, చేతులు మొద్దుబారినట్టు స్పర్శను కోల్పోయినట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ డయాబెటిస్ బాధితులకు ఏవైనా గాయాలు అయితే అవి త్వరగా మానవు. డయాబెటిస్ సైలెంట్ గా మనుషుల ప్రాణాలను తీస్తుంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ కు చూపించుకోవాలి. లేదంటే ఇబ్బంది పడవలసి వస్తుంది

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+