బరువు పెరగటానికి ప్రధాన కారణాలివే.. తెలుసుకోండి!

చాలామంది ప్రస్తుతం అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఊబకాయ బాధితులు పెరిగిపోయారు. అసలు బరువు పెరగడానికి కారణాలేంటి? బాగా ఆహారం తీసుకునే వారే బరువు పెరుగుతారా? ఏ కారణాలతో బరువు పెరుగుతారు అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మన జీవనశైలి కారణంగా మనం బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

బరువు పెరగటానికి కారణాలివే
తగినంత వ్యాయామాన్ని చేయకపోవడం, తక్కువ కదలడం, నిద్రలేమి వంటి సమస్యలు మన బరువు పెరగడానికి కారణాలుగా మారుతున్నాయి. అంతేకాదు అతిగా తినడం, తినకూడని ఆహారాలను తినడం, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం, శరీరానికి కావాల్సిన ప్రోటీన్ తీసుకోకపోవడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం మన బరువు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు.

These are the main reasons for weight gain

హార్మోన్ మార్పులు కారణంగా బరువు పెరిగే అవకాశం
కొంతమందిలో వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మరికొంతమందిలో హార్మోన్ మార్పులు కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. హార్మోన్ల మార్పులు, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, హైపోథైరాయిడిజం వంటివి కూడా మన బరువు పెరగడానికి ప్రధానమైన కారణాలుగా చెప్పవచ్చు. సరిగా నిద్ర లేకపోవడం మన బరువును అమాంతం పెంచేస్తుంది.

మానసిక స్థితి కూడా బరువు పెరగటానికి కారణం
విపరీతమైన పని ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, నిరాశ వంటి మానసిక స్థితి కూడా మన బరువు పెరగడానికి కారణమవుతుంది. కొంతమందిలో జెనెటికల్ గా తల్లిదండ్రుల నుండి వచ్చాయి. ఈ లక్షణాలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది. జనన నియంత్రణ మాత్రలు వేసుకోవడం, కార్డికో స్టెరాయిడ్స్ ను ఉపయోగించడం కూడా మన బరువు పెరగడానికి కారణం అవుతుంది.

కొన్ని రకాల మందులు కూడా బరువును పెంచేస్తాయి
మధుమేహం చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కూడా మన బరువును అమాంతం పెంచేస్తాయి. ఎక్కువ క్యాలరీలు తీసుకునే వారిలో మాత్రమే కాదు డైట్ పేరుతో సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోని వారిలో కూడా బరువు పెరిగే సమస్య ఉంటుంది. శరీరంలోని అంతర్లీన పరిస్థితులు, శారీరక మార్పులు వంటివి కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+