బొడ్డులో నూనె వేసుకుంటే జరిగే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు!

మానవ శరీరంలోని ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడినది నాభి. దీనినే వాడుక భాషలో బొడ్డు అని కూడా అంటారు. ఆయుర్వేద వైద్యంలో బొడ్డు ద్వారా చికిత్స కు ప్రాధాన్యత ఇస్తారు. మరి బొడ్డులో నూనె వేయటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అన్నింటికి మూల కేంద్రము నాభి. శరీరంలో ఎక్కడ నొప్పి కలిగిన పూర్వ కాలంలో ఆయుర్వేద వైద్యులు నాభి వద్ద నూనె రాసేవారు.

బొడ్డులో నూనె వేస్తే ఫలితాలిలా
బొడ్డులో నూనె వేయటం, బొడ్డు చుట్టూ నూనె రాసుకోవటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బొడ్డులో నూనె వేయటం కారణంగా గ్యాస్, అజీర్ణం, మలబద్ధక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. బొడ్డులో నూనె వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం అవితుంది. బొడ్డులో నూనె రాసుకుంటే సంతానం లేక బాధ పడేవారికి ప్రయోజనం కలుగుతుంది.

These are the miracles that can happen if you apply oil to your belly

ఎక్కడ నొప్పి ఉన్నా బొడ్డు దగ్గర నూనె
బొడ్డు చుట్టూ నూనె రాస్తే మెడ నొప్పికి ఉపశమనం కలుగుతుంది. పూర్వ కాలంలో నాయనమ్మలు,అమ్మమ్మలు ఈ చిట్కాలను బాగా పాటించేవారు. కడుపులో మంట అనిపించిన లేదా కడుపు ఉబ్బరంగా ఉన్నాకూడా బొడ్డు చుట్టూ నూనె రాసేవారు. అలా బొడ్డు చుట్టూ నూనె రాయడం వలన ఎంతోకొంత నొప్పి నుండి ఉపశమనం కలిగేదని చెప్తారు.

ఈ నూనెలు బెస్ట్
ఇక బొడ్డులో నూనె వేసుకోవాలనుకునేవారు, బొడ్డు చుట్టూ నూనె రాసుకోవాలి అని భావించేవారు ఆవనూనె, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల వంటి వాటిని వినియోగిస్తే మంచిది. ఆవ నూనెను బొడ్డు చుట్టూ రాసుకోవడం వలన మీ చర్మం కాంతివంతంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చర్మం పై మచ్చలు ఏర్పడకుండా ఆవనూనె నియంత్రిస్తుంది.
స్నానం చేసిన తరువాత రెండు చుక్కలు బొడ్డు చుట్టూ అప్లై చూసుకున్నట్లయితే కళ్ళలో మంటలు తగ్గుతాయి.

బొడ్డులో నూనెతో బోలెడు లాభాలు
క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు ఒక నాలుగు చుక్కల కొబ్బరి నూనెను బొడ్డులో వేసుకొని బొడ్డు చుట్టూ అప్లై చేయడం వలన పెదాలు కాంతివంతంగా మెరుస్తాయి.పెదాలపై పగుళ్ళు రాకుండా మృదువుగా ఉంటాయి. బొడ్డులో నూనె వేయటం కారణంగా వేడి తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కీళ్ళ నొప్పులు, వాపుల నుండి ఉపశమనం లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+