ఆల్కాహాల్ కన్నా లివర్ కు ఈ ఆహారాలతోనే డేంజర్!
మన ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లలో ఆల్కహాల్ తీసుకోవడం ఒకటి. అయితే మద్యం సేవించడం మాత్రమే కాదు అంతకంటే డేంజరస్ ఆహార అలవాట్లు కూడా ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఆహారాలను తీసుకుంటే మన లివర్ త్వరలోనే పాడైపోతుంది. అసలు ఆల్కహాల్ కన్నా డేంజరస్ అయిన ఆహారాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కాలేయాన్ని పాడు చేసే ఆహారాలు
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆల్కహాల్ తీసుకున్న దానికంటే కూడా కాలేయానికి చేటు చేసే ఆహారాలు చాలా ఉన్నాయి. మనకు తెలియకుండానే ఆ ఆహారాలను మనం తింటూ ఉంటాం. ఇక అటువంటి ఆహారాలలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. బంగాళదుంపలను పొడవుగా కట్ చేసి వాటిని మరిగించిన నూనెలో ఫ్రై చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ తో ఆరోగ్యానికి అనర్ధం జరుగుతుంది.

ఇవి తింటే లివర్ ప్రాబ్లమ్స్ పక్కా
అంతేకాదు ఫ్రైడే చికెన్ లాంటివి కూడా అతిగా తింటే మన ఆరోగ్యం పాడైపోతుంది. ముఖ్యంగా దీని ప్రభావం లివర్ పైన పడుతుంది. ఫ్రైడ్ చికెన్ కూడా విపరీతమైన నూనెలోనే ఫ్రై చేసి తీస్తారు. అతిగా నూనెలో ఫ్రై చేయడం వల్ల ఇవి కాలేయం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేవాటిలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ముఖ్యమైనవి.
వీటితోనూ డేంజర్ లో ఆరోగ్యం
రెడ్ మీట్ , ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల కూడా అందులో అధిక మొత్తంలో ఉండే కొవ్వు కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఇది మాత్రమే కాదు ఫాస్ట్ ఫుడ్ లోను, నిల్వ చేసిన సూప్ లు, ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటిలోనూ సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల కాలేయానికి ముప్పు వాటిల్లుతుంది.
వీటితో ఫ్యాటీ లివర్ ప్రమాదం .. జాగ్రత్త
ఇక షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లు తినడం, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వంటివి చేసినా కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్యాక్ చేసిన స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారం ఏదైనా సరే కాలేయానికి హాని చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. వాటిని తినకుండా ఉండడానికే చూడాలి. పైన చెప్పిన అన్ని ఆహారాలు ఆల్కహాల్ కంటే డేంజర్ వీటిని ఎక్కువగా తిని అనవసరమైన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవద్దని డైటీషియన్ల సలహా.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications