రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగినప్పుడు కనిపించే లక్షణాలివే!
డయాబెటిస్ ఉన్నవారు చాలామంది డయాబెటిస్ మందులను వాడుతున్నామని డయాబెటిస్ కంట్రోల్ లోనే ఉంటుందంటూ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉందా లేదా? రక్తంలో చక్కెర లెవెల్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది తరచుగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకపోతే ఒక్కోసారి ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత కూడా చాలామందికి అది అర్థం కాదు.
రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే కనిపించే లక్షణాలు
కనుక డయాబెటిస్ ఉన్నవారు ఎప్పుడు అప్రమత్తంగానే ఉండాలి. ఇక రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగితే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది ప్రస్తుతం చూద్దాం. రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగితే తేలికపాటి నుండి తీవ్రమైన అనేక లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో షుగర్ లెవల్స్ బాగా పెరిగితే చిన్న పని చేసినా అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ బాగా పెరిగితే విపరీతంగా దాహం అవుతుంది శరీరం మూత్రం ద్వారా అదనపు చక్కెరను బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది . ఈ క్రమంలో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఫలితంగా దాహం పెరుగుతుంది.అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే తలనొప్పి వస్తుంది. చూపు అస్పష్టంగా కనిపిస్తుంది.
అసలే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో లేకుంటే జరిగేదిదే
రక్తంలో ఉండే అధిక గ్లూకోజ్ కంటి లెన్స్ ను ప్రభావితం చేయడం వల్ల విజన్ బ్లర్ నెస్ వస్తుంది. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా ఉంటే, వాటిని మనం పట్టించుకోకపోతే మరింత తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి . కడుపునొప్పి, వికారం, వాంతులు, శ్వాస ఆడకపోవడం, చాలా కన్ఫ్యూజన్ గా ఉండడం, నోరు ఎండిపోవడం, నోటి దుర్వాసన వంటి లక్షణాలు కనిపిస్తాయి.
షుగర్ తీవ్రమైతే ఈ ప్రమాదాలు.. జాగ్రత్త
ఒక్కొక్కసారి హైపర్ గ్లైసిమిక్ స్థితి వచ్చి స్పృహ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. విపరీతంగా షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల నరాలు దెబ్బ తినడం, మూత్రపిండాల సమస్యలు రావడం, గుండె జబ్బులు రావడం, దృష్టి కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈ లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా వెంటనే అలెర్ట్ అవ్వాలి.












Click it and Unblock the Notifications