50ఏళ్ళ శిల్పా శెట్టి ఫిట్నెస్, సౌందర్య రహస్యమిదే!

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరు దానికోసం చేయాల్సిన శ్రమ చేయాల్సిందే. అలా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి శ్రమ చేయని వాళ్ళు తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలతో ముసలి వాళ్లు గా మారుతున్నారు. ఎవరైతే ఆరోగ్యంపైనా, ఫిట్నెస్ పైన శ్రద్ధ పెడుతున్నారో వారు ఎంత వయసు వచ్చినా సరే యుక్త వయసు వారిలాగా కనిపిస్తున్నారు.

50 ఏళ్ళు దాటినా స్లిమ్ గా, అందంగా సెలబ్రిటీలు..
ముఖ్యంగా మన బాలీవుడ్ సెలబ్రిటీల విషయానికి వస్తే మలైకా అరోరా, శిల్పా శెట్టి, ఐశ్వర్యరాయ్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు తమ ఫిట్నెస్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రతిరోజు యోగా చేయడం, ఎక్ససైజ్ చేయడం తప్పనిసరిగా భావించే వీరు 50 ఏళ్ల వయసు దాటినప్పటికీ ఇప్పటికీ స్లిమ్ గా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. ఇక తాజాగా నటి శిల్పా శెట్టి తాను ఇప్పటికీ స్లిమ్ గా ఆరోగ్యంగా కనిపించిన వెనుక ఉన్న రహస్యాన్ని అందరికీ వెల్లడించారు.

This is the fitness and beauty secret of 50-year-old Shilpa Shetty

శిల్పా శెట్టి ఫిట్నెస్, హెల్త్ సీక్రెట్ ఇదే
ప్రధానంగా తన ఆహారపు అలవాట్లు తన ఆరోగ్యానికి కారణమని శిల్పా శెట్టి చెబుతున్నారు. చాలామంది బరువు తగ్గాలన్న ఉద్దేశంతో తినడం మానేస్తారని, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ మానేసే వారు చాలామంది ఉన్నారని, అయితే తను ఆ తప్పు ఎప్పుడు చేయనని శిల్పా శెట్టి వివరించారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడంతో తన దినచర్యను ప్రారంభిస్తానని ఆమె తెలిపారు.

ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే శిల్పా శెట్టి
ఆ తర్వాత కాసేపటికి నాలుగు చుక్కల నోనీ జ్యూస్ తీసుకుంటానని పేర్కొన్నారు. ఆపై టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ తప్పనిసరిగా చేస్తానని తెలిపారు. ఫస్ట్ లో సీజనల్ ఫ్రూట్స్, బాదంపాలు, ఉడికించిన గుడ్లు, మ్యూజ్లీ తీసుకుంటానని పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనంలో నెయ్యి తప్పనిసరిగా తీసుకుంటానని, మంచి పౌష్టికాహారం తింటానని చెప్పారు.

డైట్, ఫిట్నెస్ రొటీన్లు మార్చుకుంటూ ప్రయత్నం చేస్తే స్లిమ్ గా, ఆరోగ్యంగా
అయితే తాను పాటించే ఆహారపు అలవాట్లు అందరికీ సరిపడక పోవచ్చని, మన శరీరానికి ఏ ఆహారం సరిపోతుంది? ఎటువంటి అలవాట్లు మంచివో పరిశీలించి ఎంచుకుని వైద్యుల సలహాతో డైట్, ఫిట్నెస్ రొటీన్లు మార్చుకుంటూ ప్రయత్నం చేస్తే స్లిమ్ గా ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందని శిల్ప శెట్టి తెలిపారు. ఇంత వయసు వచ్చినా శిల్పా శెట్టి ఇప్పటికి యుక్త వయస్కురాలిలాగే అందంగా, ఆకర్షణీయంగా, అంతే యాక్టివ్ గా కనిపిస్తారు. ఆహారపు అలవాట్లతో పాటు ప్రతిరోజు యోగా చేయడం శిల్పా శెట్టి ఫిట్నెస్ సీక్రెట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+