బరువును, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించే మహత్తు దీనికే!
ప్రస్తుత సమాజంలో చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతోను, ట్రై గ్లిజరైడ్స్ సమస్యతో బాధపడుతున్నారు. మన శరీరంలో మనం తీసుకునే ఆహారం మన జీవనశైలి అలవాట్ల కారణంగా గుడ్ కొలెస్ట్రాల్ కంటే బాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. అయితే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడే వాటిలో వెల్లుల్లి ఒకటి.
వెల్లుల్లిలో పోషకాలు పుష్కలం
వెల్లుల్లితో మనకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? వెల్లుల్లి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతుంది? అనే వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. వెల్లుల్లిలో మన ఆరోగ్యానికి దోహదం చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. వెల్లుల్లిలో విటమిన్ b6, విటమిన్ సి, అల్లిసిన్, మాంగనీస్ వంటి పోషకాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

వెల్లుల్లి తింటే ఆరోగ్య ప్రయోజనాలు
వెల్లుల్లి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు మనం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే ఎన్నో వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం .వెల్లుల్లి మన ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు వెల్లుల్లి తీసుకున్నట్లయితే రాకుండా ఉంటాయి. వెల్లుల్లి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తుంది. వెల్లుల్లి వైరస్లతోనూ, బ్యాక్టీరియాతోను పోరాడుతుంది.
వెల్లుల్లితో బరువుకు చెక్
ప్రతిరోజు వెల్లుల్లి తినేవారు బరువు తగ్గుతారని కూడా నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి మన జీర్ణ క్రియను మెరుగుపరిచి జీర్ణ సమస్యల నుంచి కాపాడుతుంది. వెల్లుల్లి మన శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది. ఫలితంగా ఈజీగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. వెల్లుల్లి మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లి మనల్ని అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.
వెల్లుల్లితో ట్రై గ్లిజరైడ్స్ సమస్య తగ్గుతుంది
వెల్లుల్లి గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచడంలో ఎంతగానో దోహదం చేస్తుంది. వెల్లుల్లి తినేవారిలో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ట్రై గ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నవారిలో ట్రై గ్లిజరైడ్స్ తగ్గించడానికి వెల్లుల్లి ఎంతగానో దోహదం చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆక్సిడేషన్ మరియు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి వెల్లుల్లి మన కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications