టమాటా, ఉల్లిపాయలతో అద్భుతమైన రోటి పచ్చడి!

ప్రతీరోజూ కూరలు వండుకుంటున్నా అప్పుడప్పుడు రోటి పచ్చడి చేసుకు తింటే బాగుంటుంది. రోటి పచ్చడి రుచే వేరుగా ఉంటుంది. మనం టమాటా, ఉల్లిపాయలతో తయారు చేసుకునే అద్భుతమైన రోటి పచ్చడిని ఒకసారి చూద్దాం, ఇది చాలా సింపుల్‌గా, రుచిగా తయారయ్యే చట్నీ. ఇడ్లీ, దోసె, ఉప్మా, రోటీతో తింటే అదిరిపోతుంది.

కావాల్సిన పదార్థాలు:

టమాటాలు - 3-4 మీడియం సైజ్
పెద్ద ఉల్లిపాయ - 1
పచ్చి మిర్చి - 8
వెల్లుల్లి రెప్పలు - 4-5
జీలకర్ర - ½ టీస్పూన్
పెసరపప్పు - 1 టీస్పూన్
కందిపప్పు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పోపు గింజలు - ½ టీస్పూన్
ఎండు మిర్చి: 2
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా (ఐచ్ఛికం)

Tomato Onion Chutney recipe make this South Indian style chutney perfect for idli dosa and roti

తయారీ విధానం:

టమాటాలు, ఉల్లిపాయను ముక్కలు చేసుకోండి. పచ్చి మిర్చి, వెల్లుల్లి కూడా సిద్ధం చేసుకోండి. పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి పెసరపప్పు, కందిపప్పు వేసి లైట్‌గా వేయించండి.
ఆపై అందులో పచ్చి మిర్చి వేసి కొద్దిసేపు వేయించండి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి సాఫ్ట్‌గా అయ్యే వరకు వేయించండి. ఆపై టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి మొత్తం బాగా మగ్గేలా చూడండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారనివ్వండి.

రాఖీ స్పెషల్ రవ్వ కేసరి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా.. ఇలా ట్రై చెయ్యండి!
రాఖీ స్పెషల్ రవ్వ కేసరి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా.. ఇలా ట్రై చెయ్యండి!

ఇలా చేస్తే టమాటా ఉల్లిపాయ చట్నీ మళ్ళీ మళ్ళీ కావాలంటారు

చల్లారిన మిశ్రమం మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు జోడించి ముతకగా గ్రైండ్ చేయండి. అందులో ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ తిప్పి ఒక బౌల్ లోకి తీసుకోండి. చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో పోపు గింజలు వేసి, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేగాక చట్నీ మీద పోయండి. ధనియాలు కలిపి సర్వ్ చేయండి. ఈ చట్నీ టిఫిన్స్ లోకి, అన్నంలోకి అద్భుతంగ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+