చలిలో వేడివేడి పకోడీలు ఇలా చేసి చూడండి.. క్రిస్పీగా, సూపర్ గా ఉంటాయ్!
ప్రస్తుతం చలికాలం కావడంతో ఉన్న విపరీతమైన చలిలో వేడివేడిగా ఏం తింటే బాగుండు అని చాలామంది ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళు తక్కువ టైంలో తయారు చేసుకునే స్నాక్స్ కోసం చూస్తూ ఉంటారు. అలాంటి వాటిలో పకోడీలు ఒకటి. మరి వేడివేడి ఉల్లిగడ్డ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి? క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే పకోడీ తయారు చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బాగుంటుంది.
పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు
శనగపిండి- పావు కిలో
బియ్యం పిండి- మూడు స్పూన్లు
ఉల్లిగడ్డలు- 4 పొడుగ్గా సన్నగా తరుకున్న ముక్కలు
పచ్చిమిరపకాయలు- రెండు చిన్నగా సన్నగా తరుక్కున్న ముక్కలు
ఉప్పు - రుచికి తగినంత
వంటసోడా- చిటికెడు
కరివేపాకు- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
వాము- అర స్పూను

పకోడీ పిండి కలుపునేటప్పుడు ఈ చిన్న చిట్కా
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి కలిపి చిటికెడు వంటసోడా, కరివేపాకు, కొత్తిమీర, వాము కూడా కలిపి కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ బ్యాటర్ తయారు చేసుకోవాలి. అయితే పకోడీలు కలుపుకునే పిండి తయారీకి చల్లటి నీళ్లను వాడాలి
వంట సోడా విషయంలో ఇది తెలుసుకోండి
పకోడీ పిండిని మరీ జారుగా, మరీ గట్టిగా కలుపుకోకూడదు. కాస్త పకోడీ వేయటానికి వచ్చేంత కన్సిస్టెన్సిలో కలుపుకోవాలి. అప్పుడే పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇక వంట సోడా వేసే విషయంలో కూడా చిటికెడు అంటే చిటికెడు వేయాలి. ఎందుకంటే ఎక్కువ వేస్తే పకోడీలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి. ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను వేడి నూనె వేయాలి.
పకోడీలు వేసేటప్పుడు ఇది మర్చిపోవద్దు
మళ్లీ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పకోడీలు వేయడానికి పిండి సిద్ధమైన తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి నూనె పోసి నూనె బాగా వేడైన తర్వాత అందులో పకోడీ పిండి కొద్ది కొద్దిగా వేయాలి. పకోడీలను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే తయారు చేసుకోవాలి. మంట హై లో పెడితే పకోడీలు పైన మాడిపోతాయి. లోపల ఉడకవు.
ఇలా చేస్తే పకోడీలు క్రిస్పీ గా, రుచిగా
ఇలా తయారు చేసుకున్న పకోడీలను టమాటా కచెప్ తో చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మర్చిపోకూడనివి చల్లటి వాటర్ తో పిండిని కలుపుకోవడం, వంట సోడా చిటికెడు మాత్రమే వేయడం, అలాగే పిండిలో వేడి నూనె కలుపుకోవడం.. ఇక ఈ చిట్కాలతో పకోడీలు చేసి చూడండి.. తినకుండా అస్సలు వదిలిపెట్టరు.












Click it and Unblock the Notifications