దసరా, దీపావళి సమయంలో చర్మ నిగారింపుకు పండ్ల తొక్కలు ట్రై చెయ్యండి!
మనం తీసుకునే ఆహారంతో పాటు మన శరీరానికి, మన చర్మానికి ఎన్నో మేలు చేసే పండ్లు కూడా ఉన్నాయి. పండ్లు మాత్రమే కాదు పండ్ల తొక్కలు కూడా మన చర్మానికి మేలు చేస్తాయి. మన చర్మం మెరుపును సంతరించుకునేలా చేస్తాయి. ఇక దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో మన చర్మం యొక్క నిగారింపును పెంచుకునేందుకు దోహదం చేసే కొన్ని పండ్ల తొక్కలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
పండ్ల తొక్కలతో చర్మ నిగారింపు
చాలామంది పండ్లు తిన్న తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్ల తొక్కలు మన చర్మానికి సూపర్ గా పని చేస్తాయి. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకున్న దాని కంటే ఈ పండ్ల తొక్కలతో మనం స్వయంగా చేసుకునే అనేక ప్యాక్స్ మంచి ఫలితాలను ఇస్తాయి.కొన్ని రకాల పండ్ల తొొక్కలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిల్లో మన చర్మానికి ఉపయోగపడే ఎన్నో గుణాలు ఉంటాయి.

పండ్ల తొక్కలలో మన చర్మంలో కొలాజిన్
ఈ పండ్ల తొక్కలను మనం మన చర్మ నిగారింపు కోసం ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్ల తొక్కలలో మన చర్మం లో కొలాజిన్ ను ఉత్పత్తి చేసే ఎన్నో గుణాలు ఉంటాయి. పండ్ల తొక్కలలో ముఖ్యమైన తొక్క నారింజపండు తొక్క. మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే విటమిన్ సి నారింజపండు తొక్కలో ఉంటుంది.
ఆరెంజ్ తొక్క ముఖానికి చర్మానికి అప్లై చేస్తే డెడ్ స్కిన్ మాయం
ఈ పండు తొక్కను పొడిగా చేసుకుని, దానిని రోజు వాటర్ లో కానీ పాలల్లో కానీ మిక్స్ చేసి మన ముఖానికి చర్మానికి అప్లై చేస్తే డెడ్ స్కిన్ తగ్గుతుంది. ఇది కొలాజిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దీంతో చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
బొప్పాయి తొక్కతో చర్మ నిగారింపు
ఇక బొప్పాయి పండు తొక్కలో కూడా బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్మ నివారింపును సొంతం చేసుకునేలా చేస్తాయి. బొప్పాయి తొక్కలో పపైన్ ఉంటుంది. ఇది మన చర్మం యొక్క మృదుత్వాన్ని మరియు మెరుపును కూడా పెంచుతుంది.
అరటిపండు తొక్కతో చర్మ సౌందర్యం
అరటిపండు తొక్క మన అందాన్ని ఇనుమడింప చేయడానికి, చర్మ సౌందర్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అరటిపండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. మన చర్మం పొడి బారకుండా ఉండడానికి తేమతో, మెరుపుతో ఉండడానికి అరటిపండు తొక్క ఎంతగానో దోహదం చేస్తుంది.
నిమ్మ తొక్కతో చర్మ నిగారింపు
ఇక నిమ్మ తొక్కలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. నిమ్మ తొక్కను అప్లై చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే అదనపు జిడ్డు తొలగిపోతుంది. చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. యాపిల్ పండు తొక్కలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్కను మన ముఖం పైన కానీ, చర్మం పైన కానీ రాసుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి. చర్మ నిగారింపు పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications