బరువును తగ్గించే ఈ జ్యూస్ లు ట్రై చేసి రిజల్ట్ మీరే చెప్పండి!
ఊబకాయం.. ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఊబకాయం తగ్గించడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు . కొందరు జిమ్ కు, ఏరోబిక్ సెంటర్ల బాట పడుతుంటే, మరికొందరు వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు ఆహారపు అలవాట్లు మార్చుకొని బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నారు.
బరువును తగ్గించే జ్యూస్ లు
అయితే బరువు తగ్గాలని ప్రయత్నం చేసేవారు బరువును తగ్గించుకోవడానికి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బరువును తగ్గించే కొన్ని రకాల జ్యూస్ లు ఇంట్లోనే తయారు చేసుకొని తాగితే మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు శరీర బరువును తగ్గించే కొన్ని రకాల జ్యూస్ లను తాగితే కాస్త ఉబకాయం నుంచి బయటపడవచ్చు. ఇక ఆ జ్యూస్ ల విషయానికి వస్తే..

ఉసిరి జ్యూస్
తరిగిన ఉసిరిముక్కలను గ్లాసు నీళ్లతో మిక్సీలో వేసి అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసి కొద్దిగా పుదీనా వేసి బ్లెండ్ చేసి ఉసిరి జ్యూస్ ను తయారు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం ఈ ఉసిరి జ్యూస్ తాగినట్లయితే ఇది మీ బరువును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
నిమ్మరసం తేనె
అంతే కాదు బరువును తగ్గించడానికి ప్రతిరోజు ఉదయం గ్లాస్ వేడినీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకొని ఓ సగం నిమ్మకాయ రసాన్ని పిండుకుని పరగడుపున తాగాలి .నిమ్మరసంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు తేనె లో ఉండే గుణాలు శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తాయి ఇక వెయిట్ లాస్ కావాలనుకునే వారికి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్యారెట్ జ్యూస్
అంతేకాదు వెయిట్ లాస్ కావాలనుకునేవారు తరిగిన క్యారెట్ ముక్కలలో గ్లాస్ వాటర్ పోసి జ్యూస్ తయారు చేసుకోవాలి. క్యారెట్ జ్యూస్ లో ఫైబర్ మెండుగా ఉండటం వల్ల ఇది కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంచుతుంది. బరువు తగ్గేందుకు ఇది దోహదం చేస్తుంది.
బీట్ రూట్ జ్యూస్
ఒక గ్లాసు నీటిలో తరిగిన బీట్ రూట్ ముక్కలను వేసి జ్యూస్ లా బ్లెండ్ చేసి ఆ బీట్ రూట్ జ్యూస్ ను పరగడుపున తాగితే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఆకలి తగ్గించడం జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి బీట్ రూట్ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
సొరకాయ జ్యూస్
అంతేకాదు బరువు తగ్గాలని భావించేవారు పరగడుపున సొరకాయ జ్యూస్ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. సొరకాయ ముక్కలను ఒక గ్లాసు నీళ్లతో జ్యూస్ లా తయారు చేసుకొని ఖాళీ కడుపుతో తాగితే సొరకాయలో పుష్కలంగా ఉండే ఫైబర్ ఆకలిని తగ్గించి మన వెయిట్ లాస్ కు ఎంతగానో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుని సమయానుకూలంగా వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications