Hair growth foods: జుట్టు బాగా పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి
చాలామంది జుట్టు పెరగడం లేదని తెగ బాధపడుతూ ఉంటారు. జుట్టు పెరగకపోగా జుట్టుకు సరైన పోషకాలు అందుకే జుట్టు ఊడిపోవడం, జుట్టు జీవరహితంగా తయారవడం చాలామందిని బాధపెడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి ఏం చేయాలి? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. మార్కెట్లో దొరికే అనేక ఆయిల్స్ ను కొనుగోలు చేసి జుట్టు పెరుగుదల కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు.
విటమిన్ ఈ ఉన్న ఆహారాలతో జుట్టు పెరుగుదల
అయితే జుట్టు పెరుగుదల కోసం అవసరమైన ముఖ్యమైన విటమిన్ ఈ, కొన్ని ఆహారాల ద్వారా మనకు లభిస్తుంది. మనం తీసుకునే డైట్లో ఆహారాలను చేర్చుకుంటే ఖచ్చితంగా జుట్టు పెరుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు బాదంపప్పును తీసుకుంటే మంచిది.

వీటిని ఆహారంలో భాగం చేసుకోండి.. జుట్టు పెరుగుతుంది
అలాగే పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల్లో కూడా విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. వీటిని మన ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ను వంటల్లో వాడడంతో పాటు, జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగిస్తే మంచిది. అవకాడో లో కూడా విటమిన్ ఈ తో పాటు ఆరోగ్యవంతమైన కొవ్వులు మన జుట్టుకు ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
వీటితో జుట్టు వేగంగా ఒత్తుగా పెరుగుతుంది
జుట్టు బాగా పెరగాలని భావించేవారు బ్రోకలీని కూడా తీసుకుంటే మంచిది. బ్రోకలీలోను విటమిన్ ఈ తో పాటు జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు ఉంటాయి. జుట్టు పెరుగుదలకు దోహందం చేసే వాటిలో గుడ్లు చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు గుడ్లను తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చిలకడ దుంపలలో విటమిన్ ఈతోపాటు జుట్టు పెరుగుదలకు దోహదం చేసే పోషకాలు ఉంటాయి కనుక చిలకడదుంపలను కూడా తినడం ఎంతో మంచి చేస్తుంది.
నూనెలు కాదు మంచి ఆహారం నమ్ముకోండి
అంతేకాదు పెరుగు తినడం జుట్టు పెరుగుదలను పెంచుతుంది. సాల్మన్ ఫిష్ లో కూడా విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఈపుష్కలంగా ఉన్న చేపలను తింటే కూడా జుట్టు పెరుగుదల బాగుంటుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పప్పులు ఉండేలా, ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే వాటిలో ఉండే పోషకాలు మన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగాలి అనుకునేవారు మార్కెట్లలో దొరికే నూనెలను నమ్ముకునే బదులు మంచి ఆహారాన్ని నమ్ముకుంటే మంచిది తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications