తులసితో డయాబెటిస్ కు చెక్.. కానీ

తులసి.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఒక పవిత్రమైన మొక్క. తులసి డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలతో ప్రసిద్ధి చెందిన తులసి మొక్క మన భారతీయ గృహాలలో సాధారణంగా ఉండే ఒక ఔషధ మొక్క. తాజా అధ్యయనాలు ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని సూచిస్తుంది.

తులసి ఆకులతో షుగర్ కంట్రోల్

తులసి ఆకులు ఇన్సులిన్ సెన్సిటివిటీ ని మెరుగుపరచే సమ్మేళనాలను కలిగి ఉంటాయని, తులసి ఆకులు కణాల ద్వారా మెరుగైన గ్లూకోస్ గ్రహణానికి సహాయపడుతుందని చెబుతున్నారు. తులసి ఆకులను తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని క్రమం తప్పకుండా తులసిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గాయని చెబుతున్నారు.

Tulasi Leaves For Diabetes Management And Benefits

తులసిని ఇలా తీసుకుంటే ప్రయోజనం

తులసిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇవి ఇన్సులిన్ సమర్ధతను మెరుగుపరుస్తాయి అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అయితే క్రమ పద్ధతిలో పరిమితంగా మాత్రమే తులసిని తీసుకోవాలని చెబుతున్నారు. తులసి యొక్క ఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి ప్యాంక్రియాటిక్ బీటా కణాలను రక్షించగలవు అని పరిశోధనలు చెబుతున్నాయి.

తులసితో ఇన్సులిన్ ప్రొడక్షన్

ఈ రక్షణ ఇన్సులిన్ స్రావం మరియు పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. తులసిని టీ రూపంలో తీసుకోవడం, ఖాళీ కడుపుతో ప్రతిరోజు రెండు మూడు తులసి ఆకులు నమిలి తినడం, తులసి పొడిని నీటిలో కలుపుకొని తాగడం రోజుకు ఒకటి రెండు సార్లు ఐదు నుంచి పది ఆకుల తులసి టీని తాగడం డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.

తులసిని మాత్రమే వాడొద్దు.. ఇలా చెయ్యండి

అయితే డయాబెటిస్ బాధితులు కేవలం తులసిని మాత్రమే డయాబెటిస్ కు మందుగా ఉపయోగించకూడదు. డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి తులసిని తీసుకోవడానికి ముందు సంబంధిత వైద్య నిపుణులను సంప్రదిస్తే మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవటానికి జీవన శైలిని మెరుగుపరుచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+