క్లింకార ఫుడ్ సీక్రెట్ చెప్పిన ఉపాసన!!
పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఏ వయసు వారికి ఆ వయసుకు తగినట్టు పౌష్టికాహారాన్ని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. వారి శరీర ఎదుగుదలకు కావలసిన పోషకాలను అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరిచే తల్లులు వారు పాటించే ఆరోగ్యకరమైన ఆహార నియమాలను కూడా పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటారు.
పాప క్లింకారా ఫుడ్ సీక్రెట్ చెప్పిన ఉపాసన
ఆ కోవలోనే ఉపాసన కొణిదెల తమ పాప క్లింకారాకు మంచి పౌష్టికాహారాన్ని అలవాటు చేస్తున్నానని చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన కూతురు ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం తాను ఎటువంటి ఆహారం ఇస్తున్నానన్న విషయాన్ని వెల్లడించి ఫుడ్ సీక్రెట్ ను అందరికీ పంచారు ఉపాసన కొణిదెల. తన ఆహారం విషయంలో ఉపాసన ఎంత జాగ్రత్తగా ఉంటారో, తన కుమార్తె ఆహారం విషయంలో అదే విధమైన శ్రద్ధను కనబరుస్తున్నారని వెల్లడించారు.

ఆహారంలో రాగులు ఉండేలా చూస్తున్నానని ఉపాసన కొణిదెల
రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల పట్టి క్లింకారా తీసుకునే ఆహారంలో రాగులు ఉండేలా చూస్తున్నానని ఉపాసన కొణిదెల తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి రాగులు అంటే ఇష్టమని అందుకే తన కూతురికి కూడా రాగులు అలవాటు చేశానని ఆమె తెలిపారు .ఓసారి సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా నీ కూతురికి రాగుల ఆహారం తినిపించమని చెప్పారన్నారు.
రోజువారి ఆహారంలో రాగులను చేర్చానని ఉపాసన
ఆయన కూతురు రాధే జగ్గి కూడా నాన్న మాకు రోజు రాగిజావ తాగించేవాడని ఇప్పటికీ తాను ఆ అలవాటును కొనసాగిస్తున్నారని చెప్పిందని ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనివల్లే రాధే ఎంతో ఆరోగ్యంగా ఫిట్ గా ఉందని, అదేవిధంగా తన కూతుర్ని కూడా ఫిట్ గా ఆరోగ్యంగా చూసుకోవాలని అనుకుంటున్నానని అందుకే రోజువారి ఆహారంలో రాగులను చేర్చానని ఉపాసన పేర్కొన్నారు.
ఉపాసన చెప్పిన ఫుడ్ సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం ఉపాసన చెప్పిన ఫుడ్ సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాగులను వివిధ రూపాలలో మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చిన్న పిల్లలకు మాత్రమే కాదు పెద్ద వాళ్లకు కూడా రాగులతో చేసిన ఆహారం శరీరానికి కావలసిన పోషకాలను ఇవ్వడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని చెప్తారు.












Click it and Unblock the Notifications