పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నారా? షాకింగ్ విషయాలు తెలుసుకోండి; జాగ్రత్తగా ఉండండి!!

మనం వీధుల్లో బయటకు వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితులలో పబ్లిక్ టాయిలెట్స్ ను ఉపయోగిస్తూ ఉంటాం. చాలామంది బయట షాపింగ్ మాల్స్ లో, ఆఫీసులలో ఒకే టాయిలెట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పబ్లిక్ టాయిలెట్స్ అంత సురక్షితం కాదని చెప్తున్నారు. అయితే తప్పనిసరి పరిస్థితిలో పబ్లిక్ టాయిలెట్ వాడితే జాగ్రత్త అవసరం. పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంతో ఏం జరుగుతుంది అన్న దానిపై అనేక అధ్యయనాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి .

పబ్లిక్ టాయిలెట్ సీట్ లలో 77 వేల రకాల బ్యాక్టీరియా, హానికరమైన వైరస్లు ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇవి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రకరకాల అలర్జీలను కలిగిస్తాయి. కాబట్టి పబ్లిక్ టాయిలెట్ వినియోగంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 Using public toilets? know shocking things; Be careful!!

పబ్లిక్ టాయిలెట్స్ లో జాగ్రత్తలు తీసుకోకుండా వినియోగిస్తే రకరకాల ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. బయట టాయిలెట్స్ వినియోగించుకునే వారు ఇళ్ళ నుండి బయటకు వెళ్ళేటప్పుడు వెట్ వైప్స్ ను ఉపయోగిస్తే మంచిదని చెప్తున్నారు. బయట టాయిలెట్ ఉపయోగించాల్సి వస్తే కమోడ్ కు దూరంగా ఉండాలని అంటున్నారు.

బయట పబ్లిక్ టాయిలెట్ వినియోగించే సమయంలో అక్కడ వాల్స్ ను తాకటం మంచిది కాదు. అక్కడ చాలా హానికర బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. వెస్ట్రన్ కమోడ్ ను ఉపయోగిస్తే ఉపయోగానికి ముందు తప్పనిసరిగా నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఫ్లష్ చెయ్యండి. ఆపైనే ఉపయోగించండి.

వెస్ట్రన్ కమోడ్ ఉపయోగానికి తర్వాత కూడా మూత వేసిన తర్వాతనే ఫ్లష్ చెయ్యండి. ఇలా చెయ్యటం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించాక చేతులు శుభ్రంగా కడుక్కోండి. పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర బ్యాగులు కానీ, వస్తువులు కానీ క్రింద పెట్టకండి. అవి కూడా క్రిములకు ఆవాసాలుగా మారుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+