ఈ చలికాలంలో వేడివేడి "వాము చారు" తింటే మామూలుగా ఉండదు..!
చలికాలం ప్రారంభం అయ్యింది. ఈ చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంతో పాటు ఘుమఘుమలాడే వాము చారు కలిపి తింటుంటే ఆ టెస్టే వేరు. రోజూ చేసే సాధారణ చారులకు భిన్నంగా ఉండే ఈ ప్రత్యేక వాము చారు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. జలుబు, దగ్గు, గొంతు సమస్యలు వంటి శీతాకాలపు ఇబ్బందులను తగ్గించడంలో వాము కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ చారుకి చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు.
కాగా వాము సహజంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ఇది సహాయ పడుతుంది. తక్కువ సమయంలో తయారయ్యే ఈ చారు, వెచ్చదనాన్ని ఇచ్చే లక్షణం వల్ల ఈ చలికాలంలో మంచిగా ఉపకరిస్తుంది. రోజూ టమాటా చారు, పప్పు రసం వండుతూ విసుగు చెందిన వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. వడలు, పప్పు వడలు లేదా బజ్జీలతో కూడా ఈ చారు ఒక మంచి కాంబినేషన్ అవుతుంది. ఈజీగా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

వాము చారు తయారీకి కావలసిన పదార్థాలు..
వాము పొడి కోసం అవసరమైనవి :
వాము - ½ టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 2
చారు కోసం అవసరమైనవి :
నూనె - 2 టేబుల్ స్పూన్లు
మెంతులు - 2 చిటికెలు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
వెల్లుల్లి - 4-5 రెబ్బలు (కొద్దిగా నూరినవి)
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - కొద్దిగా
చింతపండు - 30 గ్రాములు (లేదా ఒక కప్పు రసం)
పసుపు - ¼ టీస్పూన్
ఉప్పు - తగినంత
నీరు - అవసరానికి తగ్గట్టు (½ లీటర్ వరకు)
ఉడికించిన పప్పు - ¼ కప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
వాము పొడి తయారీ విధానం..
ముందుగా వాము, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
చింతపండు రసం..
చింతపండును శుభ్రంగా కడిగి 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టాలి. తర్వాత 250 ml-300 ml చిక్కటి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రసం చారు బేస్‌గా పనిచేస్తుంది.
వాము చారు తయారీ ప్రక్రియ..
- స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
- తాలింపు వాసన వచ్చాక తుంచిన ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
- తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి.
- తర్వాత చింతపండు రసం, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలియబెట్టాలి.
- ఇప్పుడు అవసరానికి తగ్గట్టు నీళ్లు పోసి మరిగించాలి.
- మరిగే నీటిలో ముందుగా తయారుచేసుకున్న వాము పొడి వేసి బాగా కలపాలి.
- ఆపై ఉడికిన పప్పు (పప్పు చారు విధంగా) వేసి మరో 5-10 నిమిషాలు మరిగించాలి. ఇది చారు తగిన మోతాదులో చిక్కదనం, రుచి ఇస్తుంది.
- చారు బాగా మరిగి బుడగలు వచ్చే సరికి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగు చల్లాలి.
-
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications