కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ జీతం ఎంతో తెలుసా? రాజభోగాలు ఇవే!

ప్రభుత్వం కీలకమైన విద్యాశాఖ మంత్రి పదవికి ఉండే అధికారాలు, బాధ్యతలే కాదు.. ఆ హోదాలో లభించే జీతభత్యాలు, ఇతర ప్రభుత్వ వసతులు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించడంతో ఈ కీలకమైన కేబినెట్ మంత్రికి లభించే శాలరీ, ప్రభుత్వ సదుపాయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ కేబినెట్ మంత్రి హోదాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పొందే వేతనం, భత్యాలు, ఇతర ప్రత్యేక సౌకర్యాల వివరాలు ఒకసారి చూద్దాం.

నెలకు ఎంత జీతం.. ఏమేం అలవెన్సులు?

కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రికి ప్రతి నెలా రూ.1 లక్ష మూల వేతనం లభిస్తుంది. అయితే దీనికి అదనంగా పబ్లిక్ సర్వీస్, ఆఫీస్ మెయింటెనెన్స్ సంబంధించి పలు అలవెన్సులను ప్రభుత్వం అందిస్తుంది

How Much Does India s Education Minister Earn Salary VIP Bungalow Security and Travel Benefits Breakdown
  • నియోజకవర్గ అలవెన్స్: ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ పర్యటనల ఖర్చుల కోసం నెలకు రూ.70,000 ఇస్తారు.
  • ఆఫీస్ అలవెన్స్: కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, పరిపాలనా ఖర్చుల కోసం నెలకు రూ.60,000 కేటాయిస్తారు.
  • డైలీ అలవెన్స్: పార్లమెంట్ సమావేశాలు లేదా కమిటీల సమావేశాలు జరిగే రోజుల్లో హాజరైనందుకు రోజుకు రూ.2,000 చొప్పున చెల్లిస్తారు.

ల్యూటియెన్స్ జోన్‌లో బంగ్లా.. ప్రభుత్వం నుంచి వాహనం!

విద్యాశాఖ మంత్రి హోదాలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని అత్యంత వీఐపీ ప్రాంతమైన 'ల్యూటియెన్స్ జోన్'లో సకల సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ బంగ్లాను ఉచితంగా కేటాయిస్తారు. ఈ బంగ్లా నిర్వహణ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. దీనితో పాటు అధికారిక విధుల నిర్వహణ కోసం వాహనం, డ్రైవర్, ఇంధన ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది.

హై-సెక్యూరిటీ భద్రత.. విమాన, రైలు ప్రయాణ సదుపాయాలు

భద్రతా సంస్థల అంచనాల ఆధారంగా కేబినెట్ మంత్రులకు ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు (PSO), కాన్వాయ్ వాహనాలు, రక్షణ చర్యలు ఉంటాయి. అలాగే అధికారిక పర్యటనల కోసం దేశంలో ఎక్కడికైనా ఎగ్జిక్యూటివ్ క్లాస్ విమాన ప్రయాణం, ఫస్ట్ క్లాస్ ఏసీ రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు కూడా ప్రయాణ ప్రయోజనాలు అందుతాయి.

ఉచిత వైద్యం, సిబ్బంది, ఇతర సదుపాయాలు

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద మంత్రికి, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది. పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పర్సనల్ అసిస్టెంట్లు, కార్యదర్శులు, సహాయక సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. నివాసం, కార్యాలయాల్లో ఉచిత ఫోన్, హై-స్పీడ్ ఇంటర్నెట్ సహా అన్ని కమ్యూనికేషన్ వసతులను అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+