రాత్రివేళ కాంతులీనుతున్న భారతవని.. రెండు కళ్లు చాలని అద్భుత దృశ్యం!: Video

ఆకాశం దాటి అంతరిక్షంలోకి వెళ్తే మన భూమి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత వెలుగు జిలుగులతో మెరిసిపోయే నగరాలు, ఆకాశంలో మెరిసే మెరుపులు కలిసి ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' (NASA) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఒక రేర్ టైమ్‌లాప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అరేబియా సముద్రం మీదుగా పయనిస్తూ దక్షిణ భారతదేశం, శ్రీలంకల పైనుంచి బంగాళాఖాతం వైపు వెళ్తున్న సమయంలో ఈ దృశ్యాలను బంధించింది. రాత్రి వేళ అంతరిక్షం నుంచి చూస్తే భారత భూభాగం వెండి వర్ణలో కనిపించింది.

NASA ISS Timelapse Video Shows Stunning Night Views of India and Sri Lanka With Ocean Thunderstorms

నగరాల కాంతులు.. ఆకాశంలో మెరుపుల వెలుగులు!

ఈ వీడియోలో అత్యంత ఆకట్టుకునే అంశం ఏంటంటే.. ఒకవైపు మన దక్షిణ భారత నగరాలు, శ్రీలంక తీర ప్రాంతాలు పసుపు, పచ్చటి దీపాల కాంతులతో వెలిగిపోతుంటే, మరోవైపు మన్నార్ సింధుశాఖ, బంగాళాఖాతం సముద్రాల పైన ఆకాశంలో వింత వెలుగులు దర్శనమిచ్చాయి. ఆ సమయంలో అక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు ఏర్పడటంతో, ఆకాశంలో మెరుపులు నీలి రంగు వెలుగులుగా మిలమిలా మెరిసాయి.

నెట్టింట హల్చల్ చేస్తున్న నాసా వీడియో

కింద నగరాల దీపాల వెలుగులు.. పైన మేఘాల్లో మెరుపుల విన్యాసాలు.. రెండూ కలిసి భూమిపై ఒక అద్భుతమైన కాంతి చిత్రాన్ని ఆవిష్కరించాయి. నాసాకు చెందిన 'ఎర్త్ సైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ యూనిట్' అందించిన ఫొటోలతో రూపొందించిన ఈ టైమ్‌లాప్స్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతరిక్షం నుంచి మన భారత్ చూడటానికి రెండు కళ్ళు చాలవంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+