నెల్లూరు స్పెషల్ 'వంకాయ బజ్జీ కూర'.. ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవెల్..!

నెల్లూర్ స్పెషల్ వంకాయ బజ్జీ కూరను ఎప్పుడైనా తిన్నారా..? టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో రుచికరంగా ఈ వంకాయ బజ్జీ కర్రీని చేసుకోవచ్చు. మరి సూపర్ టేస్టీ కర్రీని సంప్రదాయ పద్దతిలో ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ చూద్దాం..

నెల్లూర్ స్పెషల్ వంకాయ బజ్జీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే వంకాయలు 250 గ్రాములు, పచ్చిమిర్చి ఆరు నుంచి ఎనిమిది, టమాటోలు రెండు, ఉల్లిపాయలు ఒకటి, చింతపండు రుచికి తగినంత, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు వంకాయ బజ్జీ కూర తయారీ విధానం చూస్తే ముందుగా వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు అలాగే చింతపండులను సరిపడా నీటితో కలిపి ప్రెషర్ కుక్కర్ లో వేయాలి. అలా మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.

Vankaya Bajji Kura Recipe Nellore Style Eggplant Fritter Curry Ingredients and Home Method Vankaya

ఇప్పుడు ఉడికిన కూరగాయలను కుక్కర్ నుంచి తీసి పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత మెదిపిన కూరలో సరిపడా నూనె వేడి చేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. వేయించిన పోపును ఇప్పుడు మెదుపుతున్న కూరలో వేసి బాగా కలపాలి. చివరగా మరిగిన కూరలోకి తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలిపి, దించితే సరి సూపర్ టేస్టీ వంకాయ బజ్జీ కర్రీ రెడీ అయినట్టే.. ఇప్పుడు ఈజీగా ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+