విజయ్ సర్కార్ కు మద్దతు ఉపసంహరణ ? సీపీఎం అల్టిమేటం..!
తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన తర్వాత.. నాటకీయ పరిణామాల మధ్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు రోజుకో షాక్ తప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం తక్కువగా ఉన్న విజయ్.. నిర్ణయాలు తీసుకునే విషయంలో తడబడుతున్నారనే ప్రచారం ఉంది. అదే సమయంలో రాజకీయంగా ఆయన వేస్తున్న అడుగులు ప్రభుత్వ మనుగడకు ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నాయి.
గత వారం తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా అప్పటికే ఉన్న మిత్రులతో పాటు అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ బలపరీక్షకు ముందే ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్న షణ్ముగాన్ని విజయ్ నేరుగా ఆయన ఆఫీసుకు వెళ్లి కలిశారు. అనంతరం అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు కూడా ప్రభుత్వానికి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీరికి కూడా ప్రభుత్వంలో స్ధానం కల్పిస్తారన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం( CPM) స్పందించింది.

తమిళనాడులో టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వ మిత్రపక్షమైన సీపీఎం.. ముఖ్యమంత్రి విజయ్ పార్టీ ఎప్పుడైనా తమ సంకీర్ణంలో అన్నాడీఎంకేను చేర్చుకుంటే, తమ మద్దతును పునఃపరిశీలిస్తామని తెలిపింది. టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే వర్గాన్ని చేర్చడం ప్రజల తీర్పుకు విరుద్ధమని, ఈ తీర్పు డీఎంకే, అన్నాడీఎంకేలకు వ్యతిరేకంగా ఉందని సీపీఎం పేర్కొంది. సంకీర్ణంలో అన్నాడీఎంకే ఉండటం, స్వచ్ఛమైన పాలన ఇస్తామన్న టీవీకే వాగ్దానానికి కూడా విరుద్ధమని తెలిపింది. తమిళనాడు మరో ఎన్నికలకు సిద్ధంగా లేదని, గవర్నర్ పాలన ద్వారా బీజేపీ వెనుక నుండి ప్రవేశించడాన్ని తాము కోరుకోవడం లేదు, కాబట్టి తాము టీవీకేకు మద్దతు ఇస్తున్నామని సీపీఎం పేర్కొంది.














Click it and Unblock the Notifications