Vitamin D లోపం వలన మన శరీరంలో కనిపించే మార్పులివే

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావలసిన పోషకాలు తప్పనిసరిగా అందాలి. ముఖ్యంగా విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. విటమిన్ డి లోపం ఉంటే శరీరంలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవేంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. శరీరంలో విటమిన్ డి లోపిస్తే విపరీతమైన అలసటగా ఉంటుంది.

విటమిన్ డీ లోపంతో కనిపించే లక్షణాలు
ఊరికే నిద్ర వచ్చినట్టుగా, బాగా చిరాకుగా అనిపిస్తుంది. ఏ పని చేయడానికి శక్తి లేదు అనిపిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. విపరీతమైన ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. అంతేకాదు విటమిన్ డి లోపిస్తే చర్మం పొడిబారడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉన్నవారిలో జుట్టు రాలే సమస్య ప్రారంభమవుతుంది.

Vitamin D deficiency causes changes in our body

విటమిన్ డీ లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు
ఎవరికైతే విటమిన్-డి లోపం ఎక్కువగా ఉంటుందో వారికి వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పదేపదే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు విటమిన్ డి లోపం కూడా కారణమని గ్రహించాలి.

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
విపరీతంగా జాయింట్ పెయిన్స్ ఉంటే, విటమిన్ డి లోపం కావచ్చు అన్నది గుర్తించాలి. ఇలా నొప్పులు ఎక్కువగా వచ్చే వారు విటమిన్ డి లోపాన్ని సరి చేసుకోవాలి. ఇక విటమిన్ డి లోపంతో బాధపడేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ డి పుష్కలంగా ఉండే విధంగా చూసుకోవాలి.

ఇవి తినండి.. అన్నిటికంటే అది ముఖ్యం
ముఖ్యంగా ఆహారంలో సోయాబీన్, గుడ్లు, చీజ్, సీజనల్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు ఉండేలా చూసుకోవాలి.
ప్రతిరోజు మంచి పౌష్టికాహారాన్ని మాత్రమే తినాలి. విటమిన్ డి శరీరానికి పుష్కలంగా అందాలంటే ప్రభాత సూర్యుని కిరణాలు మన శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీరోజూ ఉదయాన్నే కాసేపు సూర్య కాంతిలో తిరగాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+