నిశ్శబ్ద మహమ్మారి.. ప్రతి ఐదుగురిలో ఒకరికి.. సంచలన నివేదిక!

భారతదేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి 'సన్‌షైన్ విటమిన్' అయిన విటమిన్ డి లోపం వెంటాడుతుంది. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా (దాదాపు 39 శాతం) ఉందని ఒక సమగ్ర నివేదిక వెల్లడించింది. ఈ కీలక విటమిన్ లోపానికి సంబంధించిన సమస్యలను విశ్లేషిస్తూ ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంకులు ప్రచురించింది. ఐక్రియర్ (ICRIER), అన్వ్కా ఫౌండేషన్ సంయుక్తంగా "భారతదేశంలో విటమిన్ డి లోపానికి సంబంధించిన నివేదికను రూపొంచాయి.

యువత, నవజాత శిశువులు, వృద్ధులలో తీవ్రత:
కౌమారదశలో ఉన్నవారు, నవజాత శిశువులు, వృద్ధులలో విటమిన్ డి సమస్య మరింత తీవ్రంగా ఉందని నివేదిక నొక్కి చెప్పింది. అంతేకాకుండా, అన్ని వయసుల మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఈ లోపానికి గురవుతున్నారని, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉందని ద్వితీయ డేటా విశ్లేషణ, విస్తృత అధ్యయనాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక పేర్కొంది.

vitamin-d-deficiency-plagues-eastern-india-report-warns

విటమిన్ డి ప్రాముఖ్యత:
విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఎముకల పెరుగుదల, అభివృద్ధికి, వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, కాల్షియం, ఫాస్పరస్ శోషణకు చాలా అవసరం. మన శరీరం సూర్యరశ్మికి నేరుగా గురైనప్పుడు దీన్ని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. చేపలు, కాలేయం, గుడ్డు పచ్చసొన వంటి కొన్ని ఆహార పదార్థాలలో కూడా ఇది లభిస్తుంది.

నిశ్శబ్ద మహమ్మారి - కారణాలు అనేకం:
"విటమిన్ డి లోపం లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక నిశ్శబ్ద మహమ్మారి, అయినప్పటికీ ఇది ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతోంది" అని ఆకాష్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్, నివేదిక సహ రచయిత డాక్టర్ ఆశిష్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం కేవలం బలహీనమైన ఎముకలకే పరిమితం కాదని, రోగనిరోధక శక్తిని బలహీనపరచడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచడం, కుటుంబాలు , ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై గణనీయమైన ఆర్థిక భారాన్ని మోపడం వంటివి చేస్తుందని ఆయన అన్నారు.

ఎండ తగిలినా లోపం ఎందుకు?
భారతదేశంలో ఏడాది పొడవునా సమృద్ధిగా సూర్యరశ్మి లభించినప్పటికీ, పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ, మారిన జీవనశైలి కారణంగా ప్రజలు ఎండకు తగినంతగా గురికావడం లేదని నివేదిక స్పష్టం చేసింది. పట్టణాల్లో అధిక వాయు కాలుష్యం అతినీలలోహిత B (UVB) కిరణాలను అడ్డుకోవడం వల్ల చర్మం విటమిన్ డిని సంశ్లేషణ చేయలేకపోతోంది. ఇరుకైన నివాసాలు, ఎక్కువ సమయం ఇళ్లలోనే లేదా ఆఫీసుల్లోనే గడపడం కూడా ఎండ తగలడం లేదు. అంతే కాకుండా చర్మం నల్లబడకుండా ఉండటానికి గొడుగులు, సన్‌స్క్రీన్ వాడటం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం వల్ల విటమిన్ డి లోపానికి కారణమవుతుంది. భారతీయుల చర్మంలో సహజంగా మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా విటమిన్ డి ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.

ఆహార పరిమితులు, పరిష్కారాలు:
విటమిన్ డి అధికంగా ఉండే ఆహార వనరులు తక్కువగా ఉండటం, ముఖ్యంగా ఆకుకూరలు, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు పేదలకు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా తగిన విధంగా ఈ విటమిన్ అందడం లేదు. పాలను ఎక్కువసేపు మరిగించడం వంటి వంట పద్ధతులు, లాక్టోస్ అసహనం (Lactose Intolerance) వంటివి కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. కాబట్టి పాలు, నూనెతో పాటు గోధుమ, బియ్యం వంటి నిత్యావసర ఆహార పదార్థాలతో విటమిన్ డి అధికంగా ఉంటుంది. కనుక వీటిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్లను జాతీయ అత్యవసర ఔషధాల జాబితా (NLEM)లో చేర్చాలని ఈ సంస్థలు కోరుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+