చలికాలంలో విటమిన్-డీ లోపం.. ఈ ఆహారాలతో మాయం!
జీవితంలో డబ్బు ఎంత ప్రధానమో అంతకంటే ఆరోగ్యం ప్రధానం. ఆరోగ్యం లేకుండా డబ్బు ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పరుగుల ప్రపంచంలో మారుతున్న జీవన శైలి కారణంగా ఏ ఇంట్లో చూసినా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. మనిషి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్ డి చాలా అవసరం.
చలికాలంలో విటమిన్ డీ సమస్య
చలికాలం వచ్చేసింది. శీతాకాలంలో విటమిన్ డి లోపంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో సూర్య రశ్మి తగినంతగా అందక పోవటం వలన చాలా మంది విటమిన్ డీ సమస్య తో ఇబ్బంది పడుతున్నారు, విటమిన్ డి మన శరీరం యొక్క పనితీరుకు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడుతుంది. విటమిన్ డీ మన ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

మనకు విటమిన్ డీ అవసరం ఎంత ఉంటుందంటే
విటమిన్ డి లోపంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి శరీర వ్యవస్థల పైన శక్తివంతమైన ప్రభావాలను చూపిస్తుంది.. ఇక శీతాకాలంలో విటమిన్ లోపాన్ని నిర్వహించడం ఒక సవాలనే చెప్పాలి. విటమిన్ డి మన ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతో అవసరం. ఎముకల ఆరోగ్యం కోసం అవసరమైన క్యాల్షియం, ఫాస్ఫరస్ ను శరీరం గ్రహించడంలో విటమిన్ డి సహాయపడుతుంది.
విటమిన్ డీ లోపంతో ఈ సమస్యలు
విటమిన్ డి లేకపోతే ఎముకలు పెళుసుగానూ, బలహీనంగాను మారుతాయి. అంతేకాదు విటమిన్ డి ఆహారం నుండి కాల్షియం యొక్క సరైన శోషణను ప్రోత్సహిస్తుంది. విటమిన్ డి రక్తంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడానికి పనిచేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. గట్ హెల్త్ కు సహకరిస్తుంది.
విటమిన్ డీ లోపం ఉంటే ఈ ఇబ్బందులు కూడా
ఇక శీతాకాలంలో విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడేవారు కండరాల బలహీనతను, నొప్పులను ఎదుర్కొంటారు. విటమిన్ డీ లోపం ఉంటే మానసిక స్థితిలో మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు విటమిన్ డీ లోపం ఉన్నవారు తరచూ నిరాశకు గురవుతారు. కొంతమంది ఆర్థరైటిస్ సమస్యలతో ఇబ్బంది పడతారు.
శీతాకాలంలో విటమిన్ డీ ని పొందాలంటే ఏం చేయాలి?
ముఖ్యంగా శీతాకాలంలో విటమిన్ డి పొందాలంటే విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, కోడిగుడ్లు, తృణధాన్యాలు, కాడ్ లివర్ ఆయిల్ తదితర ఆహారాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే సాధ్యమైనంత సూర్య రశ్మిని శరీరం గ్రహించేలా ఎండలో ఉండే ప్రయత్నం చెయ్యాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications