సంతోషంగా ఉండాలనుందా? అయితే మీలో ఉండే హ్యాపీ హార్మోన్స్ గురించి తెలుసుకోండి!
చాలామంది జీవితంలో సంతోషంగా లేవని బాధపడుతూ ఉంటారు. జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకునేవారు అన్నిటికంటే ముందు మన శరీరంలో ఉండే హార్మోన్లను గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అవును మన శరీరంలో సంతోషాన్ని ప్రేరేపించే హార్మోన్లు ఉంటాయి. మనం సంతోషంగా ఉండడానికి ఆ హార్మోన్లే కారణం. మన శరీరంలో ఉండే హ్యాపీ హార్మోన్లు ఏమిటి? అవి చేసే పని ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మానవ శరీరంలో దూతల్లా పనిచేసే హార్మోన్లు
సంతోషమే సగం బలం అంటారు. అటువంటి సంతోషం కోసం ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన పనులు చేస్తారు. ఇష్టమైన వారితో మాట్లాడతారు. ఇష్టమైనట్టు బ్రతుకుతారు. ఈ అన్ని చర్యలు మన శరీరంలో హ్యాపీ హార్మోన్లను ప్రేరేపిస్తాయి. మన సంతోషానికి కారణమవుతాయి. మానవ శరీరంలో దూతలుగా పనిచేయడానికి, వివిధ జీవ సంబంధమైన విధుల్లో పాల్గొనడానికి హార్మోన్లు రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

శరీరంలో కీలకంగా హ్యాపీ హార్మోన్లు
మన మానసిక స్థితిని నియంత్రించడానికి, మన శరీరానికి కావలసిన వివిధ పనుల్లో సహాయం చేయడానికి ఈ రసాయనాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరంలోని కొన్ని హార్మోన్లు మనలో సంతోషం, సంతృప్తి వంటి సానుకూలమైన భావోద్వేగాలను పెంపొందించడానికి దోహదం చేస్తాయి. అటువంటి హార్మోన్లని హ్యాపీ హార్మోన్లు అంటారు.ప్రస్తుత మనం ఆ హ్యాపీ హార్మోన్ల గురించి తెలుసుకుందాం.
డోపమైన్.. ఫీల్ గుడ్ హార్మోన్
హ్యాపీ హార్మోన్లలో ముఖ్యమైనది డోపమైన్. ఇది మన శరీరాన్ని సంతోషంగా ఉంచే హార్మోన్లలో ఒకటి. మన మెదడు లోని రివార్డ్ సిస్టంలో కీలక పాత్ర పోషించే న్యూరో ట్రాన్స్మిటర్ ఇది. దీనిని ఫీల్ గుడ్ హార్మోన్ అని అంటారు. ఈ హార్మోన్ మనం నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి కలిగి ఉండడం, వంటి వాటితో పాటు మన మనసుకు నచ్చే ఆహ్లాదకరమైన భావాలకు అనుసంధానించబడి ఉంటుంది.
సెరటోనిన్, ఆక్సిటోసిన్ లు చేసేది ఇదే
హ్యాపీ హార్మోన్లలో మరొకటి సెరటోనిన్. ఇది కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మానసిక స్థితి నియంత్రించడం, ఆకలి, నిద్ర, జ్ఞాపకశక్తి, జీర్ణక్రియ వంటి భావనలను మనకు కలిగిస్తుంది.హ్యాపీ హార్మోన్లలో మరొక ముఖ్యమైన హార్మోన్ ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ నే ప్రేమ హార్మోన్ గా కూడా చెబుతారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలకు, భార్యాభర్తల మధ్య ప్రేమకు కీలకమైన హార్మోన్ ఇది.
ఎండార్ఫిన్ లు కూడా సంతోషానికి కీలకం
జీవిత భాగస్వామిపై ప్రేమను, నమ్మకాన్ని కలిగించే హార్మోన్. శారీరక ప్రేమతో ఆక్సిటోసిన్ స్థాయిలు పెరిగి మన సంతోషానికి కారణమవుతాయి. అందుకే దీనిని లవ్ హార్మోన్ అంటారు. హ్యాపీ హార్మోన్లలో ఎండార్ఫిన్లు కూడా ముఖ్యమైనవి . ఈ ఎండార్ఫిన్లు మన మనసులోని ఒత్తిడిని తగ్గించి, నొప్పి వంటి లక్షణాలను తగ్గించి, మనకు సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఈ హార్మోన్లు వ్యాయామం చేయడం, సెక్స్ చేయడం, ఇలా శారీరకంగా మనం చేసే కొన్ని చర్యల వల్ల ఉత్పత్తి అవుతాయి.












Click it and Unblock the Notifications