కొలెస్ట్రాల్ తగ్గాలా? అయితే వీటిని తప్పక ట్రై చెయ్యండి!

కొలెస్ట్రాల్...ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది. కొలెస్ట్రాల్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది గుండె జబ్బులకు దారితీస్తుంది. అటువంటి కొలెస్ట్రాల్ ను తగ్గించడం కోసం మన వంటింట్లో లభించే ఏడు శక్తివంతమైన దినుసులను మనం ప్రయత్నం చేయవచ్చు. తద్వారా మనం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.

అల్లం, వెల్లుల్లి తో కొలెస్ట్రాల్ కు చెక్
ప్రతి ఒక్కరం మనం ఇళ్లల్లో అల్లం వెల్లుల్లి తప్పకుండా వాడుతూ ఉంటాము. అటువంటి అల్లం, వెల్లుల్లి రెండు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అల్లం టీ రోజు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాదు వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

Want to lower your bad cholesterol Then you should definitely try these

పసుపు, మెంతులతో కొలెస్ట్రాల్ కంట్రోల్
ఇక నిత్యం మనం ఉపయోగించే వాటిలో పసుపు కూడా ఒకటి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది. పసుపును ఉపయోగిస్తే కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. మెంతులను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే కూడా మెంతులలో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి దోహదం చేస్తుంది.

గ్రీన్ టీ, తులసి ఆకులతో చెడు కొవ్వు నుండి ఉపశమనం
ప్రతిరోజు టీ, కాఫీలను తాగేవారు వాటిని తాగకుండా గ్రీన్ టీ చేసుకుని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక తులసి ఆకులను కూడా వేడి నీళ్లలో కానీ టీలో కానీ వేసుకుని మరిగించి తాగితే కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి తులసి ఆకులు ఎంతగానో దోహదం చేస్తాయి.

దాల్చిన చెక్కతో కొలెస్ట్రాల్ తగ్గుదల
ఇక మన ఆహారంలో ఉపయోగించే దాల్చిన చెక్కను టీ లో లేదంటే, రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే కూడా కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టడానికి పైన పేర్కొన్న పదార్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+