బాన పొట్ట తగ్గాలా? అయితే ఈ పండ్లు తినండి చాలు!
ప్రస్తుతం సమాజంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం ఒకటే కాదు బాన పొట్ట. ఇది మరింత ఇబ్బందికరంగా మారిన సమస్య. చాలామంది పొట్ట తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్ని వ్యాయామాలు చేసిన బెల్లీ ఫ్యాట్ తగ్గలేదని చాలా బాధపడుతూ ఉంటారు.
బెల్లీ ఫ్యాట్ తగ్గించే పండ్లు
అటువంటివారు బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసం సరైన డైట్ ను చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు డైటీషియన్లు. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లతో బెల్లీ ఫ్యాట్ ను కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఉపయోగపడతాయని అంటున్నారు.

బెర్రీలు, జామ పండ్లు
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి పండ్లతో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించవచ్చని చెబుతున్నారు వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పొట్ట తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయని సూచిస్తున్నారు. జామ పండు కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. జామ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది . కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఫలితంగా పొట్ట తగ్గుతుంది.
యాపిల్స్
ప్రతిరోజు యాపిల్ పండ్లను తినటం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, యాపిల్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన ఆకలిని తగ్గిస్తుందని అంటున్నారు. అతిగా తినడాన్ని నిరోధించి పొట్ట తగ్గేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. యాపిల్ పండును ప్రతిరోజు తింటే వెయిట్ తగ్గుతారని సూచిస్తున్నారు.
ద్రాక్ష పండ్లు, బొప్పాయి.. ఇంకా
ద్రాక్ష పండ్ల లో కూడా మన బరువును తగ్గించి, పొట్టను తగ్గించే ఎన్నో పోషకాలు ఉంటాయి. ద్రాక్ష పండ్ల లో ఉండే పోషకాలు మన ఇన్సులిన్ స్థాయిలను కూడా తగ్గిస్తాయని, తద్వారా బరువు తగ్గుతుందని అంటున్నారు.ఇక బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో నారింజ పండ్లు, బొప్పాయి ఎంతో బాగా పనిచేస్తాయని చెబుతున్నారు.
పైనాపిల్, కివీ పండ్లు
పైనాపిల్ బరువు తగ్గడానికి, పొట్ట తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపు బ్లోటింగ్ ను తగ్గిస్తుంది. కివి పండ్లు కూడా పొట్ట తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి, ఫైబర్ పొట్ట తగ్గిస్తాయి. కనుక బెల్లీ ఫ్యాట్ తగ్గాలని భావించేవారు బరువు, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే ఈ పండ్లను తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications