వేగంగా బరువు తగ్గేందుకు వాటర్ థెరపీ.. ఇలా ట్రై చెయ్యండి!

బరువు తగ్గడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడంలో నీళ్లు ఎంతగానో దోహదం చేస్తాయి అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నీళ్లు అధికంగా తాగడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. అయితే నీళ్ళని ఏ విధంగా తాగాలి? ఏ విధంగా నీటిని తాగితే మనం బరువును తగ్గించుకోగలుగుతామో ఒకసారి చూద్దాం.

నీళ్ళను ఇలా తాగితే బరువు తగ్గుతారు
మనకు ఆకలి అనిపించిన ప్రతిసారి శరీరం ఆహారాన్ని తీసుకోవాలని సూచించినట్టు కాదు. ఆకలిగా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఎటువంటి క్యాలరీలు లేకుండా కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఇది ఆకలిని అణిచివేస్తుంది. శరీరానికి కావలసిన తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. ఇలా నీళ్లను తాగడం వల్ల కొంతమేరకు బరువును తగ్గవచ్చు .

Water therapy for fast weight loss try this drink luke warm water daily

ఇలా నీళ్ళు తాగితే ఎక్కువ ప్రయోజనం
ఇక నీళ్లను అధికంగా తీసుకుంటే ఒంట్లో ఉన్న క్యాలరీలు కరుగుతాయి. మన జీవక్రియ సాఫీగా సాగడానికి ఇది ఒక వ్యాయామం లాంటిది అంతే కాదు నీళ్లను అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో ఉన్న మలినాలు బయటకు వెళతాయి. పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్య, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే నీళ్లను ఎక్కువగా తీసుకునేవారు గోరువెచ్చని నీళ్లను తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

కొవ్వు కరగాలంటే ఇలా చెయ్యాలి
అయితే నీళ్ల స్థానంలో కూల్ డ్రింక్స్ వంటివి తీసుకుంటే మాత్రం మళ్లీ బరువు పెరుగుతారు. కాబట్టి వాటిని దూరం పెట్టడం మంచిది. ఇక శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగించాలంటే తరచూ కాస్త గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇక వ్యాయామం చేసినప్పుడు కూడా శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుంది.

నీళ్ళను ఎక్కువ తాగితే బోలెడు లాభాలు
ఆ సమయంలో కూడా నీటిని తాగడం వల్ల మనకు కావలసిన తక్షణ శక్తి లభిస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అవి లాలాజలాన్ని ఉత్పత్తి చేసి ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. మన శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తాయి. మనం తాగే నీళ్లు మన రక్తంలో ఉండే చక్కర స్థాయిలను కూడా అదుపు చేస్తాయి. ఎక్కువగా చిరు తిండ్లు తినాలనే కోరికను నీళ్లు కంట్రోల్ చేస్తాయి.

నీళ్ళతో ఈ సమస్యలకు చెక్
స్వీట్స్ తినాలనే కోరికను నీళ్లు తగ్గిస్తాయి. మధుమేహం ఉన్నవారికి నీళ్లు ఎక్కువగా తాగడం అనేక లాభాలు చేకూరుతాయి. కొంతమంది థైరాయిడ్ సమస్య కారణంగా కూడా బరువు పెరుగుతారు. అధికంగా నీళ్లను తీసుకుంటే ఈ సమస్యను అదుపు చేయవచ్చు. అయితే నీళ్లను తాగేటప్పుడు కూర్చుని తాగడమే మంచిది.. కొద్దిగా గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండడం వల్ల అది మంచి ఫలితాలను ఇస్తుంది. మన బరువు తగ్గడానికి కీలకంగా దోహదం చేస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+