కడుపు నిండా తింటూనే ఈజీగా బరువు తగ్గండి!
చాలామంది బరువు తగ్గడం కోసం కడుపు కాల్చుకుని తక్కువ ఆహారం తీసుకుంటారు. కడుపునిండా తింటే బరువు పెరుగుతామని తెగ భయపడిపోతూ ఉంటారు. అయితే కడుపునిండా తింటూనే ఈజీగా బరువు తగ్గొచ్చు అని చెప్తున్నారు డైటీషియన్లు అదెలా అంటారా...బరువు అదుపులో ఉంచుకోవడానికి కఠినమైన ఆహారపు అలవాట్లతో ఇక పనిలేదని, కొద్దిగా తిని రోజంతా కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
కడుపునిండా తిని బరువు తగ్గండి
హాయిగా కడుపునిండా తిని ఈజీగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. అయితే స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా కూరగాయలు, పండ్లు, ధాన్యాలు మొదలైన వాటిని ఎక్కువగా తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా కొన్ని కూరగాయలను ప్రతి రోజు తింటే సులభంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు.

సొరకాయ
సొరకాయ బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయలలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉండడం వల్ల ఇది మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ ను ఎక్కువగా తీసుకోకుండా ఆపుతుంది. సొరకాయలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచుతుంది, ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన దీంతో బరువు పెరిగే అవకాశం ఉండదు.
క్యారెట్
తక్కువ క్యాలరీలు ఉండి మన బరువును కంట్రోల్ చేసే వాటిలో క్యారెట్ ఒకటి . క్యారెట్ ని కూడా కడుపునిండా తిన్నట్లయితే ఇది మన హార్మోన్లను సమతుల్యం చేసి బరువు తగ్గిస్తుంది. రోజువారి ఆహారంలో క్యారెట్లను తినేవారు ఈజీగా బరువు తగ్గుతారు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మీ బరువును కంట్రోల్ చేయడానికి దోహదం చేస్తుంది.
క్యాబేజీ
క్యాబేజీలు కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాబేజ్ కూడా మన బరువును తగ్గించడానికి బాగా పని చేసే ఆహారం. క్యాబేజీని కూడా మనం ప్రతిరోజు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతాం. క్యాబేజ్ ను సలాడ్ లో తీసుకోవడం బరువును బాగా తగ్గిస్తుంది.
కీర దోసకాయ
కీర దోసకాయ కూడా బరువును తగ్గించడానికి దోహదం చేసే కూరగాయ. వీటిని కూడా మనం రోజు పొట్ట నిండా పుష్కలంగా తిన్నట్లయితే ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి శరీరానికి కావలసిన ఫైబర్ ఎక్కువగా అందించి బరువు తగ్గేలా చేస్తుంది. కనుక కీర దోసకాయను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. ఈ కూరగాయలను కడుపునిండా పుష్కలంగా తిని ఏమాత్రం కడుపు మాడ్చుకోకుండా ఆరోగ్యంగా బరువు తగ్గండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications