రోజు చపాతీలు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా..!!
చపాతీలు చాలా మంది ఇష్టపడతారు. రాత్రి సమయంలో భోజనం మానేసి చపాతీ తినేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీని ద్వారా బరువు నియంత్రణతో పాటుగా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే, రోజూ చపాతీలు తినటం ఆరోగ్యరమేనా అనే చర్చ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో.. చపాతీలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి సమస్యలు వస్తాయనే అంశం పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
చపాతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పరిశోధనల ప్రకారం చపాతీలు గుండె ఆరోగ్యానికి ప్రయోజన కరంగా గుర్తించారు. బరువు తగ్గడానికీ చపాతీలు మంచి ఆహారం అని నిపుణులు అంటున్నారు. రోజూ రెండు సాధారణ సైజు చపాతీలను తినడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుందని వివరించారు. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కృషి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకు రోజూ చపాతీని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. చపాతీని పోషకాల సమ్మేళనంగా చెబుతారు.ఇందులో బి, ఇ విటమిన్లతో పాటు క్యాల్షియం, జింక్, కాపర్, అయొడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

చపాతీల్లో ఉండే అధిక ఐరన్ స్థాయులు శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఫలితంగా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతాయని వివరించారు. కాగా, చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముడిగోధుమలు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది. గోధుమపిండికి రాగి, సోయాబీన్, చిరుధాన్యాలతో చేసిన పిండిని కూడా కలుపుకొని చపాతీ తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్ పిండిని వాడుకోవాలని సూచిస్తున్నారు. కాగా, చపాతీలను పరిమితంగా తీసుకున్న వరకు సమస్య ఉండదని.. దాటితే మాత్రం సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications