బ్రౌన్ రైస్‌తో ఎవరికి ప్రయోజనం - ఏ స‌మ‌యంలో తింటే మంచిది..!?

ఈ మధ్య కాలంలో ఆహారం పైన శ్రద్ద పెరిగింది. రోజూ తినే తెల్ల అన్నానికి బ‌దులుగా బ్రౌన్ రైస్ తిన‌డం ఎక్కువైంది. రోగాల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే అందుకు బ్రౌన్ రైస్ ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది. బ్రౌన్ రైస్‌ను తింటేనే అధికంగా పోష‌కాలు ల‌భిస్తాయి. దీన్ని రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇవి మ‌న‌కు రోగాలు రాకుండా ర‌క్షిస్తాయి. బ్రౌన్ రైస్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించటంతో మధుమేహ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది. దీంతో పాటుగా అనేక ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

బ్రౌన్ రైస్‌ను తింటే అందులో ఉండే మెగ్నిషియం, సెలీనియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్ రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.
బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు రోజూ బ్రౌన్ రైస్‌ను తింటుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. బ్రౌన్ రైస్‌లో ఫైబ‌ర్ ఉండ‌డం, త‌క్కువ గ్లైసీమిక ఇండెక్స్ విలువ ఉండ‌డం కార‌ణంగా ఈ రైస్‌ను తింటే పిండి ప‌దార్థాలు నెమ్మ‌దిగా ర‌క్తంలో గ్లూకోజ్‌గా మారుతాయి. దీంతో ఆహారం తిన్న వెంట‌నే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు తెల్ల అన్నంకు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటుంటే ఎంతో ఉప‌యోగం ఉంటుంది. సాధార‌ణ వైట్ రైస్ క‌న్నా బ్రౌన్ రైస్‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అధిక మొత్తంలో ఉంటాయి.

what-are-the-key-nutritional-benefits-of-brown-rice-compared-to-white-rice

ఈ బ్రౌన్ రైస్‌లో అధికంగా ఉండే మెగ్నిషియం మ‌న శ‌రీరంలో 300కు పైగా జీవ ర‌సాయ‌నిక క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండ‌రాల‌ను ప్ర‌శాంతంగా మారేలా చేస్తుంది. బ్రౌన్ రైస్‌లో ఉండే సెలీనియం యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక థైరాయిడ్ ఉన్న‌వారు బ్రౌన్ రైస్‌ను రోజూ తింటుంటే మేలు జ‌రుగుతుంది. బ్రౌన్ రైస్‌లో అనేక ర‌కాల బి విట‌మిన్లు సైతం అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంతోపాటు మెట‌బాలిజంను మెరుగు ప‌రుస్తాయి. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ చురుగ్గా ఉండేలా చేస్తాయి. బ్రౌన్ రైస్‌ను మధ్యాహ్నం లంచ్ స‌మ‌యంలో తింటే మంచిది. ఈ రైస్‌ను రాత్రి పూట తింటే త్వ‌ర‌గా జీర్ణం కాదు. జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయి. కాబ‌ట్టి బ్రౌన్ రైస్‌ను మ‌ధ్యాహ్నం తినాలి. బ్రౌన్ రైస్‌ను తింటుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+