కొర్రలు తింటే ఏమవుతుంది? తెలుసుకోండి!
భారతదేశంలో చాలా మంది ప్రస్తుతం ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని వైద్య నిపుణులు, డైటీషియన్లు ప్రతీ ఒక్కరూ నొక్కి చెప్తున్నారు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి ఫైబర్ ప్రోటీన్ ను పెంచాలని చాలామంది డైటీషియన్లు చెబుతున్నారు.
చిరు ధాన్యాల ఆహారం... ఆరోగ్యానికి వరం
ఈ క్రమంలోనే ప్రస్తుతం చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది చిరు ధాన్యాల వాడకాన్ని కూడా పెంచారు. ఇక మార్కెట్ లోనూ చిరుధాన్యాల ఆహారాలు లభిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని చిరుధాన్యాల ప్రాముఖ్యతను అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. చిరు ధాన్యాల ఆహారం... ఆరోగ్యానికి వరం అని చాలామంది భావిస్తున్నారు.

కొర్రలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
అయితే చిరుధాన్యాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వాటిలో కొర్రలు ఒకటి. కొర్రలు పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి. అయితే కొర్రలలో నలుపు, తెలుపు రంగులు ఉన్న కొర్రలను శ్రేష్టమైన కొర్రలుగా చెబుతారు. మనం నిత్యం ఆహారంలో భాగంగా కొర్రలను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఒబేసిటీ తగ్గుతుంది.
కొర్రల ఆహారం తింటే బరువుకు, షుగర్ కు చెక్
కొర్రలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి కొర్రలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. కొర్రలు తినేవారిలో కఫ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. కొర్రలు శరీరానికి పుష్టిని ఇవ్వడంతో పాటు మన శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నరాలకు శక్తినిస్తాయి.
కొర్రలతో ఈ రోగాల నుండి విముక్తి
కొర్రలు మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి జ్వరాలు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. పార్కిన్సన్ , మూర్చ వంటి రోగాల నుండి కొర్రలు ఉపశమనాన్ని ఇస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కొర్రలు మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, పోషకాలు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు అందించి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి చిరుధాన్యాలలో కొర్రల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
disclaimer: ఈ కథనం డైటీషియన్లు, వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications