సజ్జలు తింటే ఏమవుతుందో తెలుసా!
ప్రస్తుతం మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలామంది ఉబకాయ బాధితులుగా మారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుత జీవనశైలికి తగ్గట్టు ఆహారపు అలవాట్లు మార్చుకుంటే కొంతమేర బరువును కంట్రోల్ చేసుకోవచ్చని అంతేకాదు అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు డైటీషియన్లు.
సజ్జలతో ఆరోగ్యం
ముఖ్యంగా ప్రస్తుతం మిల్లెట్స్ ఆహారం పైన చాలామందిలో అవగాహన పెరిగింది. ప్రతిరోజు మిల్లెట్స్ తినడం వల్ల అనేక రోగాలు తగ్గుతాయని గుర్తించారు. ఇక అటువంటి చిరుధాన్యాలలో సజ్జలు ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతిరోజు సజ్జలను తినడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సజ్జలు ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి, మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

సజ్జలతో డయాబెటిస్ కు చెక్
సజ్జలు తినడం వల్ల డయాబెటిస్ కూడా రాకుండా ఉంటుంది ఒకవేళ డయాబెటిస్ తో బాధపడేవారు సజ్జలను తింటే సజ్జలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ ను కంట్రోల్ అయ్యేలా చేస్తాయి. వేరే ఆహారాలతో పోలిస్తే సజ్జలు కాస్త నిదానంగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఇవి రక్తంలోకి గ్లూకోజ్ ను మెల్లగా విడుదల చేస్తాయి.
సజ్జలతో చర్మ ఆరోగ్యం
సజ్జల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతగానో దోహదం చేసి శరీరం మెటబాలిజం బాగా జరిగేలా చేస్తాయి. సజ్జలను తింటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు ఊబకాయం బారి నుండి కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది సజ్జల్లో ఫినాలిక్ లు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించిన సమస్యలలో యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పని చేస్తాయి.
సజ్జలతో గుండె ఆరోగ్యం
సజ్జలను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. చర్మం మీద ముఖం మీద ముడతలు తొలగిపోయి ఆరోగ్యంగా కనిపిస్తారు. ఇక సజ్జలలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఇవి మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో రక్తహీనతను తగ్గిస్తాయి. సజ్జలు మన జీవక్రియను మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ ను నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి.
సజ్జలతో రోగ నిరోధక శక్తి, బరువుకు చెక్
రోగనిరోధక శక్తిని పెంచి అద్భుతమైన శక్తి వనరుగా పనిచేస్తాయి. మన బరువును తగ్గించటంలో కూడా సజ్జలు కీలక భూమిక పోషిస్తాయి. మొత్తంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సజ్జలను మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. మరింకెందుకు ఆలస్యం... సజ్జలను ఆహారంలో తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.
disclaimer: ఈ కథనం డైటీషియన్లు, వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications