మన శరీరంలో చెమట అస్సలు పట్టని భాగం ఏమిటి? ఆసక్తికర విషయాలు తెలుసా!!
మన శరీరం, మన శరీరంలోని భాగాలు పనితీరు గురించి అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మన శరీరం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని కొన్ని విషయాలు వింటే అవును కదా.. అన్న భావన కలుగుతుంది. మరికొన్ని అవునా.. ఇది నిజమేనా అనేలా ఉంటాయి. ఇక అటువంటి విషయాలలో మన శరీరంలోని ఒక భాగానికి చెమట పట్టదు అన్నది అత్యంత ఆసక్తికరమైన విషయం.
సాధారణంగా విపరీతమైన వేడిలో శరీరం నుండి చెమటలు వస్తాయి. చెమటను స్రవించే గ్రంధిని ఎక్సో క్రైన్ అంటారు. మన శరీరంలోని చేతులు, పాదాలు, భుజాలు, వీపు, తల మరియు తొడల భాగంలోనూ, అరచేతులు, అరికాళ్ళతో సహా ప్రతీ భాగంలోనూ విపరీతంగా చెమట పోస్తుంది. కానీ శరీరంలో ఎప్పుడూ చెమట పట్టని ఒక భాగం ఉంది.

మన శరీరంలో చెమట పట్టని భాగం మన పెదవులు. మానవ శరీరంలో అత్యంత అందమైన భాగం పెదవులు. పెదవిరంగు శరీరం నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొంతమంది పెదవులు ఎర్రగా, గులాబీరంగులో, తెల్లగా, నల్లగా కూడా ఉంటాయి. అయితే పెదవులు ఏ రంగులో ఉన్నా, ఏ సీజన్ అయినా పెదవులకే చెమట పట్టదు. శరీరం మొత్తానికి చెమట పట్టి పెదవులకు ఎందుకు చెమట పట్టదు? అని చాలామందికి అనుమానం కలుగుతుంది.
అయితే అందుకు కారణం లేకపోలేదు. పెదవులకు చెమట పట్టకపోవటం వెనుక అసలు కారణం పెదవులపై స్వేద గ్రంధులు లేకపోవడం. పెదవులపై స్వేద గ్రంధులు లేవు కాబట్టే బాగా వేడిగా ఉన్నా, బాగా చల్లగా ఉన్నా మన పెదవులు పొడిబారిపోతాయి. మానవ శరీరంలో పెదవులు మినహా మొత్తం 16 రకాల పొరలతో రూపొందించబడుతుంది.
కానీ పెదవులలో మూడు, నాలుగు పొరలు మాత్రమే ఉంటాయి. ఇది పెదవులపై రక్త సిరలు ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు మన వేలిముద్రల తరహాలోనే పెదవి గుర్తులు కూడా భిన్నంగా ఉంటాయి. అంతేకాదు వృద్ధాప్యంలో మన పెదవుల మందం తగ్గటం ప్రారంభం అవుతుంది. ఇవన్నీ పెదవుల గురించి ఆసక్తికర విషయాలు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications