ఉసిరి జ్యూస్ - గోధుమ గ‌డ్డి ర‌సం.. రెండింట్లో లివర్ ఆరోగ్యానికి ఏది బెస్ట్..!?

లివర్ సమస్యలు ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లతో ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అధిక కార్బొహైడ్రేట్లు, కూర్చునే జీవనశైలి, ఒత్తిడి వంటివి లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారాల్లో ఉసిరి రసం, గోధుమ గడ్డి రసం రెండూ శక్తివంతమైన పానీయాలు అని చెప్ప‌వ‌చ్చు. వీటి పోషక విలువలు, ప్రయోజనాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించడంలో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే సందేహాలను నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ పేరుకునే మలినాలను తొలిగించుకొనే పానీయాలు ఎంతో అవసరం. అలాంటి వాటిలో ఉసిరి మేలు చేస్తెంది. టానిన్స్ వంటి ప్రత్యేక స‌మ్మేళ‌నాలు లివర్‌లో హానికర పదార్థాలు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో ఉసిరి రసం తోడ్పాటు అందిస్తుంది. ఉసిరి ఎక్స్‌ట్రాక్ట్ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక గోధుమ గడ్డి రసాన్ని గ్రీన్ బ్లడ్ గా చెబుతారు. ఇందులో సుమారు 70 శాతం క్లోరోఫిల్ ఉండటం వల్ల ఇది శరీరాన్ని ఆల్కలైన్ స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. వీటి ద్వారా లివర్ ఎంజైమ్‌ల స్థాయిలను సమతుల్యం చేయవచ్చని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఉసిరి రసం వల్ల లిపిడ్ నియంత్రణ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి లివర్ కణాల నష్టాన్ని తగ్గిస్తుంది.

బెంగాల్ లో కొత్త చరిత్ర- పెరిగిన ఓటింగ్ వెనుక, కోటలకు బీటలు..!!
బెంగాల్ లో కొత్త చరిత్ర- పెరిగిన ఓటింగ్ వెనుక, కోటలకు బీటలు..!!
wheatgrass-is-a-superfood-that-has-many-nutrients-and-antioxidants-amla-is-recognized-for-its-abili

జీవన శైలి.. ఒత్తిడి అధిగమించటం అవసరం

కాగా, గోధుమ గడ్డి రసం కణ స్థాయిలో డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. క్లోరోఫిల్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహకరిస్తుంది. అలాగే లివర్ ఎంజైమ్‌లను నియంత్రించి ఇన్‌ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. దీనిలోని బయో ఫ్లేవనాయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఉసిరి రసం ఫ్యాటీ లివర్ నియంత్రణ.. లివర్‌లో కొవ్వు తగ్గించడంలో ఇది కొంత మెరుగైన ఫలితాలు ఇస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో 15 మి.లీ ఉసిరి రసం, 15 మి.లీ గోధుమ గడ్డి రసం కలిపి గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. అదే సమయంలో సమతుల్యత పాటిస్తూ ఆహారం.. జీవన శైలి.. వ్యాయామం.. ఒత్తిడి తగ్గించుకోవటం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల్లో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+