ఏ బ్లడ్ గ్రూప్స్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి? ఎందుకు?
దోమలు మనిషికి బాధను కలిగించే కీటకాలు. దోమలు మనుషులను కుట్టి బాధించటంతో పాటు, తమ జెర్మ్స్ ద్వారా అనేక వ్యాధులు కూడా కలిగిస్తాయి. దోమలు కుట్టడం వల్ల మనిషికి అనేకరకాలైన రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ. చికెన్ గున్యా, బోదకాలు వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
ఇక అటువంటి దోమలు ఎవరిని పడితే వాళ్లను కుట్టవు. దోమలు కుట్టడానికి కూడా వాటికి కావలసిన నిర్దిష్ట వాసన ఉండాలి. ముఖ్యంగా ఒక బ్లడ్ గ్రూపు వాళ్ళను దోమలు విపరీతంగా కుడతాయి. రక్తంలో O పాజిటివ్, O నెగిటివ్, A పాజిటివ్, A నెగిటివ్, B పాజిటివ్, B నెగిటివ్, AB పాజిటివ్, AB నెగిటివ్ మొత్తం ఎనిమిది రకాలు ఉంటాయి.ప్రతి బ్లడ్ గ్రూపు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి.

అయితే O బ్లడ్ గ్రూప్ లోని వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయి అని జపాన్ పరిశోధకులు ఒక అధ్యయనంలో తేల్చారు. O బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు చాలా ఇష్టం. వివిధ రకాల బ్లడ్ గ్రూప్ లు ఉన్న వారు ఒక చోట కూర్చుంటే, వారిలో O పాజిటివ్, O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లో ఉన్న వారినే ఎక్కువగా దోమలు కుడతాయని నిర్ధారించారు.
ఆ తర్వాత A బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఈ రెండు బ్లడ్ గ్రూప్ లు దోమలకు బాగా ఇష్టమైన బ్లడ్ గ్రూప్ లని చెబుతారు. ఇక B బ్లడ్ గ్రూపు ఉన్నవారిని దోమలు చాలా తక్కువగా కుడతాయి. మిగతా బ్లడ్ గ్రూప్ లు ఉన్న వాళ్లను కూడా దోమలు పెద్దగా కుట్టవు.
O బ్లడ్ గ్రూప్ వారి రక్తం దోమలకు చాలా తియ్యగా, టేస్టీగా ఉంటుందని చెప్తారు. ఆ తర్వాత A బ్లడ్ గ్రూప్ రక్తం దోమలకు టేస్టీగా ఉంటుందట. అందుకే ముఖ్యంగా O మరియు A బ్లడ్ గ్రూప్ లు ఉన్నవారు దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దోమలు ఒక్కోసారి ప్రాణాంతకమైన వ్యాధులు కలగజేసి, మరణానికి కూడా కారణం కావచ్చు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications