హైబీపీ ఉన్నవారు వీటిని తింటే మీ గుండె సేఫ్..!!
హైబీపీ. అధిక శాతం మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్న వారు కూడా హైబీపీ బారిన పడుతున్నారు.అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్త మైన జీవన విధానం హైబీపీ వచ్చేందుకు కారణం అవుతున్నాయి. హైబీపీ ఉందని తేలితే కచ్చితంగా డాక్టర్ సూచన మేరకు జీవితాంతం మందులను వాడాల్సిందే. మందులను క్రమం తప్పకుండా వాడుతూనే మరోవైపు వ్యాయామంపై దృష్టి పెట్టాలి. బీపీని నియంత్రించడంలో ఆహారం ఎంతగానో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంచి ఆహారంతో హైబీపీ బాధితుల గుండెకు రక్షణ కవచంగా మారుతుంది.
బీపీ నియంత్రణలో బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు మేలు చేస్తాయి. ఈ బెర్రీ పండ్లలో ఆంథో సయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. హైబీపీ ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తింటున్నా ఉపయోగం ఉంటుంది. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువల్ల వీటి జ్యూస్‌ను రోజూ తాగుతున్నా కూడా బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. హైబీపీ తగ్గేందుకు బీట్ రూట్ సైతం మేలు చేస్తుంది. నారింజ, గ్రేప్ ఫ్రూట్, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఇతర సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి కూడా రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి బీపీ తగ్గేలా చేస్తాయి. యాపిల్, కివి, అవకాడోలు, డ్రై యాప్రికాట్స్ వంటి పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఓట్స్, బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్, పాస్తా, కినోవా, బార్లీ వంటి తృణ ధాన్యాలు కూడా బీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. వారంలో ఒకటి లేదా 2 సార్లు చేపలను తింటుంటే మేలు జరుగుతుంది. హైబీపీ ఉన్నవారు టోఫు, సోయా ఉత్పత్తులను తీసుకోవాల్సి ఉంటుంది. సోయా టోఫు, సోయా పాలు, మీల్ మేకర్ వంటివి మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే వృక్ష సంబంధ ప్రోటీన్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. హైబీపీ ఉన్నవారు కొవ్వు ఉన్న పాలను తాగకూడదు.
కొవ్వు లేని పాలను తాగాలి. హైబీపీ ఉన్నవారికి బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు మేలు చేస్తాయి. వీటిని అన్నీ కలిపి రోజుకు గుప్పెడు తిన్నా చాలు ఎంతో మేలు జరుగుతుంది. ఇక వంట నూనెల విషయానికి వస్తే రిఫైన్డ్ నూనెలు కాకుండా గానుగలో ఆడించిన నూనెలు అయితే మంచిది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, తులసి వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇలా ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకుంటే హైబీపీ ఉన్నవారికి ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications