హార్ట్ ఎటాక్ ముప్పు తప్పాలంటే.. ఈ మార్పులు అవసరం..!!

హార్ట్ ఎటాక్. ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాల ను బలి తీసుకుంటోంది. గుండెపోటు రావటానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా శరీరం లోని కొలెస్ట్రాల్ స్థాయి గుండె పైన ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు పేరుకోవటమే ఎక్కువ మందిలో గుర్తించిన కారణం. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా, హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు. ఇందుకు గాను నిత్యం మ‌నం తీసుకునే ఆహారం.. జీవన శైలిలో పలు మార్పులు చేసుకోవాలి

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రై గ్లిజ‌రైడ్స్ స్థాయిలు అధికంగా ఉంటే గుండెకు న‌ష్టం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచుకోవాలి. ఇందు కోసం ఓట్స్ మేలు చేస్తాయి. ఓట్స్‌లో సాల్యుబుల్ ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌కు అతుక్కుంటుంది. అది బ‌య‌ట‌కు వెళ్లేలా చేస్తుంది. క‌నుక ఓట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె పోటు రాకుండా నివారించ‌వ‌చ్చని సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ప‌ప్పు దినుసులు, శ‌న‌గ‌ లు, ప‌చ్చి బ‌ఠానీలు కూడా ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిల్లోనూ సాల్యుబుల్ ఫైబ‌ర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించి గుండె పోటు రాకుండా చేస్తుందిని సూచిస్తున్నారు.

which-food-helps-to-maintain-heart-health-and-prevent-strokes-details-here

బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్‌, చియా విత్త‌నాలు, అవిసె గింజ‌లు వంటి ఆహారాల‌ను తీసుకోవాలి. వీటిల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటిని రోజూ నీటిలో నాన‌బెట్టి తినాల్సి ఉంటుంది. సాల్మ‌న్‌, మాక‌రెల్‌, హెర్రింగ్‌, ట్యూనా వంటి చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని త‌ర‌చూ తింటే ట్రై గ్లిజ‌రైడ్స్‌ను త‌గ్గిస్తాయి. బీపీ నియంత్ర‌ణ‌లో ఉండేలా చేస్తాయి. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతున్న ప్ర‌కారం వారంలో క‌నీసం 2 సార్లు చేప‌ల‌ను తింటే గుండె పోటు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి.

అదే విధంగా పాల‌కూర జ్యూస్‌ను రోజూ తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె, నైట్రేట్స్ ర‌క్త నాళాలను వెడ‌ల్పుగా చేస్తాయి. బీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల వంటి బెర్రీ పండ్ల‌ను రోజూ తింటుండాలి. వీటితో పాటుగా రోజు నడక, శారీరక వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవటం ద్వారా గుండె పోట్లకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+