షుగరు ఉన్నవారికి ఇడ్లీ, దోసెల్లో ఏది మంచింది..ఎలా తీసుకోవాలి..!?
ఇడ్లీ - దోసె.. ఈ రెండు ప్రతీ ఇంటి నిత్యం ఉండే అల్పాహారాలు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ టిఫిన్లే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే.. ఈ రెండు షుగరు బాధితులు తీసుకోవచ్చా. రెగ్యులర్ గా తీసుకోవటం ద్వారా రక్తంలో గ్లూకోజు స్థాయిని పెంచుతాయా అనే సందేహాలు ఉన్నాయి. అయితే, ఇడ్లీ - దోసె ఈ రెండింటిలో షుగరు బాధితులకు ఏది మంచింది.. వైద్యులు అసలు ఈ రెండు అల్పాహారాలను షుగరు పేషంట్లు తీసుకోవచ్చా అనే అంశం పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ఇప్పుడు షుగరు బాధితుల సంఖ్య ప్రతీ రోజు పెరుగుతోంది. మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్లు.. పెరుగుతున్న ఒత్తిడి షుగరు బాధితుల సంఖ్య పెరగటానికి కారణాలుగా మారాయి. ఇదే సమయంలో షుగరు బాధితులకు ప్రణాళికా బద్దమైన జీవన శైలి ఎంత అవసరమో.. బ్రేక్ ఫాస్ట్ అదే స్థాయిలో కీలకం. ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ - దోసె తీసుకుంటారు. వీటిల్లో బియ్యం, మినప్పప్పు నుండి ప్రోటీన్లు, బి విటమిన్లు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లభిస్తాయి. కాగా, డయాబెటిస్ ఉన్నవారు మితంగా ఇడ్లీ, దోసెలు తినవచ్చు, కానీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి తయారీకి సాధారణ బియ్యానికి బదులుగా జొన్న, రాగి, మిల్లెట్ వంటి తృణధాన్యాలను కలిపి ఇడ్లీ, దోసెలు చేసుకోవడం ద్వారా వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ (రక్తంలో చక్కెరను పెంచే రేటు) ను తగ్గించవచ్చు.

ఇక.. ఇడ్లీని సాంబార్ లేదా కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల ఆహారంలో ఫైబర్ శాతం పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అదే విధంగా..ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకేసారి ఎక్కువ ఇడ్లీలు, దోసెలు తినడం మానుకోండి. ఒక నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే,షుగరు చికిత్స తీసుకుంటున్నారు మాత్రం ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు లేదా ఏదైనా కొత్త ఆహారం గురించి నిర్ణయం తీసుకునే ముందు మీ వైద్యుడిని లేదా డయాబెటిస్ నిపుణుడిని సంప్రదించడం ద్వారా సమస్యలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications